Ram Charan-Akira Nandan: సెన్సేషనల్ కాంబోలో మూవీ ఫిక్స్.. రికార్డులు బ్రేక్ అవుతాయా?

Ram Charan-Akira Nandan: మెగా అభిమానులకు అదిపోయే శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో.. మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-అకీరా నందన్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అకీరా నందన్ తెరపై కనిపించనున్నట్లు ప్రచారం జరగడంతో మెగా ఫ్యాన్ తెగ సంబర పడిపోతున్నారు. డైరెక్టర్ రాజమౌళి చేతిలో పడితే.. ఒకే సినిమాలో పాన్ ఇండియా స్టార్‌గా అవతారమెత్తుతాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకీరా నందన్‌కు మామూలుగా క్రేజ్ ఉండదు. తండ్రిలాగే తాను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడు. కేవలం తన తల్లి రేణు దేశాయ్ అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయనప్పటికీ అకీరా క్రేజ్ స్టార్ హీరోలకు ధీటుగా ఉంటుంది. యూత్‌లో అకీరాకు ఊహించని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. అతనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. సినిమాల్లో ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ రేంజ్‌లో అకీరా కూడా సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.

 

 

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC 15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ కూడా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. RC 15తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నారు

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -