Ram Charan: గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కి రామ్ చరణ్ డుమ్మా.. కారణం ఏంటంటే?

Ram Charan: మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడం తెలిసిందే. దసరా సందర్భంగా విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో, హిట్ కొట్టేశామంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
నిజానికి చిరంజీవి చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్ గా వచ్చింది. లూసీఫర్ సినిమాను చూసిన రాంచరణ్.. తన తండ్రికి ఇది సరిగ్గా సరిపోయే సినిమా అని భావించి, రాంచరణ్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అదే విషయాన్ని చిరంజీవికి చెప్పి.. సినిమాకు ఒప్పించాడట.
మొత్తానికి ‘గాడ్ ఫాదర్’ సినిమా భారీ అంచనాల మధ్య, బాగా పబ్లిసిటీతో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విషయంలో మెగా అభిమానులు విపరీతమైన ఆనందంలో ఉండగా.. అట్టహాసంగా సక్సెస్ మీట్ కూడా జరగడం జరిగింది. అయితే ఈ సక్సెస్ మీట్ కి రాంచరణ్ రాకపోవడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి ముందు నుండి ఆతృతగా ఉన్న రాంచరణ్ సినిమా.. సక్సెస్ మీట్ కి కూడా రాకపోవడం ఏంటనే చర్చ సాగుతోంది.
రాంచరణ్ సక్సెస్ మీట్ కి రాకపోవడానికి కారణం ఆయన బిజీ షెడ్యూల్ కారణం అని సమాచారం. రాంచరణ్ వరుసగా కొత్త బ్రాండ్లను సైన్ చేస్తూ, వాటి కోసం షూటింగ్ మరియు ప్లానింగ్ లో బిజీగా ఉన్నాడట. ఈ హడావిడిలోపడి వేరే ఏ ప్రాజెక్టుకు టైం కేటాయించే పరిస్థితిలో రాంచరణ్ లేడని, అందుకే సక్సెస్ మీట్ కి రాలేకపోయినట్లు సన్నిహితులు నుండి సమాచారం అందుతోంది. కానీ రాంచరణ్ ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీద ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -