Ram Charan: ఎలక్షన్ మీటింగ్ పెట్టబోతున్న రామ్ చరణ్.. కారణాలివే!

Ram Charan: ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. దీంతో రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి.. మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఊహించిన స్థాయిలో ఏ సినిమాలోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం హిట్ అయింది. ప్రస్తుతం ఆయన కేఎస్.రవీంద్ర దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు, సినిమాలంటూ పయనిస్తున్నారు. ఖాళీ సమయాల్లో సినిమాలు చేయడం, ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఎలక్షన్ మీటింగ్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

అయితే ఎలక్షన్ మీటింగ్ అంటే.. రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు కాదు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి RC 15 అనే సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పొలిటికల్ మీటింగ్ పెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 22న కొవ్వూరు, రాజమండ్రి దగ్గర గోదావరి మధ్యన ఉన్న దీవుల్లో డైరెక్టర్ శంకర్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమృత్‌సర్, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్స్ చేసిన శంకర్.. ఇప్పుడు కొవ్వూరు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నారు. గోదావరి మధ్యన దీవుల్లో ప్రత్యేకంగా ఒక సెట్‌ను ఏర్పాటు చేసి.. వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్ ఎలక్షన్ మీటింగ్ నిర్వహించే సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలువనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, విలన్‌గా ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాక్ కూడా కీలకపాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -