Ram Charan: అలాంటి కథకు చరణ్ ఒప్పుకున్నాడంటే షాకవ్వాల్సిందే!

Ram Charan: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చెర్రీ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఇటీవల ఒక బిగ్‌ హిట్‌ తెచ్చిపెట్టింది. ఒకవైపు సినిమాల్లో నటుస్తూనే.. కొన్ని చిత్రాలు నిర్మించడంలో చెర్రీ బిజీగా ఉన్నారు. చరణ్‌ తండ్రి మెగాస్టార్‌ చిరు హీరోగా వచ్చిన ఆచార్య మూవీ.. తాజాగా విడుదలైన గాడ్‌ ఫాదర్ మూవీ నిర్మాణ పనుల్లోకూ రామ్‌ తన మార్కును చూపించారు.

 

 

తాజాగా మెగా పవర్‌ స్టార్ రామ చరణ్‌ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఆర్‌సీ-16 కోసం ఆయన ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే చరణ్‌.. గౌతమ్‌ తిన్ననూరి యువీ క్రియేషన్స్‌తో ఓ సినిమా తీస్తారని తెలిసింది.

 

– RC 16 పై కొత్త అప్డేట్‌
అయితే RC 16 మూవీని చెర్రీ పక్కన పెట్ట్టేసినట్లు తెలిసింది. RC 16 కు సంబంధించి తాజాగా అప్డేట్‌ అందింది. సుకుమార్‌ శిష్యుడు.. ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీకి దర్వకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీలాగానే RC 16 కు చరణ్‌ మరో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు ఉండవని.. వీల్‌ చైర్‌లోనే ఉంటాడని టాక్‌ నడుస్తోంది. అయితే ఆ క్యారెక్టర్‌కు సంబంధించి సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కథ చెర్రీకి సెట్‌ అవుతుందా.. ఈ క్యారెక్టర్‌లో చెర్రీని ప్రేక్షకులు ఆక్సెప్ట్‌ చేస్తారా అని చర్చించుకుంటున్నారు.

 

ప్రస్తుతం రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ జంటగా RC 15 మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. చెర్రీ, కియారా అద్వానీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వినయ విదేయ రామ సినిమా సక్సెస్‌ అయ్యింది. RC 15 మూవీలో ప్రముఖ నటీనటులు చాలా మంది నటిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని చిత్రాలు లీక్‌ అయ్యినట్లు తెలిసింది. సినిమాకు సంబంధించి కొ పాటను న్యూజిలాండ్‌లో షూట్‌ చేయగా .. ఒక్క పాటకే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో నటి అంజలి కూడా ప్రముఖ పాత్రలో నటిస్తుండగా.. చెర్రీ, అంజలి కలిసి ఉన్న ఫోటో వైరల్‌ అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -