Ram Charan: తల్లి కాబోతున్న ఉపాసన.. అఫీషియల్ గా చెప్పడంతో?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి శుభవార్త వినిపించాడు. తన ఇంట్లో త్వరలోనే సిసింద్రి సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు. తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోడలు ఉపాసనలకు త్వరలోనే శిశువు జన్మించబోతున్నట్లు అధికారికంగా చిరంజీవి మరియు సురేఖల పేరుతో ఓ ఫోటోను విడుదల చేయడంతో.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

2012లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అయిన ఉపాసనలు ఒక్కటయ్యారు. అయితే పది సంవత్సరాలు గడిచినా వీరిద్దరికి పిల్లలు కలగకపోవడంతో చాలాసార్లు రకరకాల నెగిటివ్ వార్తలు కూడా రావడం తెలిసిందే. అయితే తాము మొత్తానికి ఇవాళ మెగా కుటుంబం అధికారికంగా తీపి వార్తను అందరితో పంచుకుంది.

 

ఉపాసన మరియు రామ్ చరణ్ లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలను అధికారికంగా మెగాస్టార్ కుటుంబం మరియు కామినేని కుటుంబం ప్రకటించింది. ఉమ్మడిగా ఓ ప్రకటనను విడుదల చేసింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి బాలుడి రూపంలో ఉన్న ఫోటోను పెట్టి.. ఈ శుభ వార్తను రెండు కుటుంబాలు శుభవార్తను వెల్లడించాయి.

 

ప్రస్తుతం ఉపాసన మరియు రామ్ చరణ్ లు మెగా కుటుంబంతో కాకుండా వేరే ఇంట్లో ఉండగా.. వారు వారివారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తుండగా.. ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటుండటం తెలిసిందే. కాగా మెగా కుటుంబం నుండి మూడో తరం వస్తుండటంపై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -