Ram charan: చరణ్ డబ్బుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తారా?..

Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ఒక్కో సినిమాతో నెక్స్ట్ లెవల్‌కు వెళ్తున్నారాయన. ‘చిరుత’ మూవీతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ మెగా వారసుడు.. ‘మగధీర’ ఫిల్మ్‌తో తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత అడపాదడపా విజయాలు అందుకున్నప్పటికీ నటుడిగా అంత పేరును దక్కించుకోలేకపోయారు. అయితే ‘రంగస్థలం’ చిత్రం చరణ్ లోని ఉత్తమ నటనను బయటకు తీసుకొచ్చింది.

 

సాధారణంగా ఫ్లైట్లు, డ్యాన్సులు బాగా చేస్తాడనే పేరు సంపాదించిన రామ్ చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ వరల్డ్ ఇమేజ్‌ను చరణ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ బడా డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు.

 

ఎంత స్టార్ అయినప్పటికీ చరణ్ క్రమశిక్షణతో ఉంటారు. ఎదిగే కొద్దీ ఒదగాలనే సూత్రానికి కట్టుబడినట్లు ఆయన వ్యక్తిత్వం ఉంటుందని సన్నిహితులు, సినిమా జనాలు చెబుతారు. అయితే డబ్బు విషయంలో చరణ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనే ఓ అపోహ ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై పలు సినిమాలు నిర్మించిన చరణ్.. డబ్బుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే రూమర్ ఉంది. ఈ విషయంపై సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్ వివరణ ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

అన్నింట్లో బెస్ట్‌గా ఉండాలనుకుంటారు
రామ్ చరణ్ ప్రతి విషయంలో బెస్ట్‌గా ఉండాలని అనుకుంటారని వినాయక్ అన్నారు. ఆయన మంచి మనసున్న మనిషి అని కొనియాడారు. సెట్స్ కు ప్రతిరోజు వచ్చి లెక్కలు చూసుకునే లాంటి ప్రొడ్యూసర్ చరణ్ కాదన్నారు. ‘చరణ్ అందరి లాంటి ప్రొడ్యూసర్ కాదు. సినిమా ఓకే అనుకున్నాక వాకాడ అప్పారావును పెట్టేసి.. అన్ని బాధ్యతలు ఆయనకు అప్పజెప్పేస్తారు. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఇస్తారు’ అని వినాయక్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -