Ram Pothineni: ఆ డేట్ కు ఫిక్సైన రామ్.. ముహూర్తబలం పని చేస్తుందా?

Ram Pothineni: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు పెద్ద ఎత్తున నమ్మకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వారు ఏ పని చేసినా కూడా సరైన ముహూర్తం చూసుకొని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాటిని నటుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను నిర్మాత చిట్టూరి శీను ఎంతో విశ్వసిస్తారు.ఇక బాలకృష్ణ గారిని చూసుకొని తాను కూడా తన అలవాటులను పూర్తిగా మార్చుకున్నానని బోయపాటి శ్రీను ఇదివరకే ఈ విషయాలు గురించి తెలియజేశారు.

ఇకపోతే తాజాగా బోయపాటి శీను రామ్ పోతినేనీతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని విడుదల చేయడానికి విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.వేసవి సెలవులు మొదలుకొని ఆగస్టు వరకు కూడా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని దసరాకి విడుదల చేయాలని బోయపాటి ప్లాన్ చేశారు.

 

దసరా పండుగ అక్టోబర్ 21 న మొదలవుతోంది. అష్టమి..నవమి… దశమి 22..23..24..ఈ తేదీలకు ముందు వచ్చే శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత చిట్టూరు శ్రీను అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా కూడా విడుదల కాబోతోంది. అయితే బాలయ్య కూడా సినిమాలో విడుదల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుంటారు.

 

ఇక అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాని విడుదల చేయడానికి విడుదల తేదీలను పరిశీలించిన బాలకృష్ణ అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ముహూర్తం బాలేదని బాలకృష్ణ మరొక తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని భావించారట. అయితే ఇలా బాలకృష్ణకు అచ్చిరాని ఈ రోజున రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న సినిమాని విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. మరి బాలయ్య వదిలేసిన ఈ తేదీ రామ్ బోయపాటికి కలిసి వస్తుందా… లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Narsapuram MP Candidate: ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. చంద్రబాబు పట్టుబట్టడంతో పొలిటికల్ లెక్కలు మారతాయా?

Narsapuram MP Candidate: వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు సంపాదించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజుకు ప్రస్తుతం ఏ పార్టీ నుంచి కూడా టికెట్ లేకపోవడంతో ఈయన పరిస్థితి కాస్త అయోమయంలో ఉంది కానీ ఈయన...
- Advertisement -
- Advertisement -