Rangasthalam Mahesh: వైరల్ అవుతున్న రంగస్థలం మహేష్ కామెంట్స్.. గొప్పోడంటూ?

Rangasthalam Mahesh: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ మహేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. చాలామంది జబర్దస్త్ మహేష్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ రంగస్థలం మహేష్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ మధ్యకాలంలో మహేష్ బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు. అందుకు గల కారణం వెండితెరపై వరుసగా
అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో విడుదలయ్యే చాలా సినిమాలలో మహేష్ తప్పకుండా ఉంటున్నాడు.

చిన్న పాత్రలో అయినా మెరుస్తున్నాడు. ఎక్కువగా హీరోలకు ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మంచి మంచి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించాడు. అదేవిధంగా కార్తికేయ నటించిన గుణ 369 సినిమాలో హీరో కి ఫ్రెండ్ గా నటించాడు.అలాగే హీరో శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమాలో నటించాడు. అలాగే హీరో విశ్వక్ సేన్ నటించిన రెండు సినిమాలలో నటించాడు. అలా ఇప్పటికే దాదాపు పదికి పైగా సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్. ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన సింప్లిసిటీ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ మాట్లాడుతూ..

 

మంచి మంచి సినిమాలలో నటిస్తున్నారు కదా ఇంతవరకు ఎందుకు మీరు కారు కొనలేదు ఏదైనా రీసన్ ఉందా అని యాంకర్ అడగగా.. ఆ విషయం పై స్పందించిన మహేష్ నాకు కారు ఇవి అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఎక్కువగా ఇల్లు అంటే ఇష్టం అందుకే ఇంతకీ ఇంపార్టెన్స్ ఇచ్చాను. మొదటి ల్యాండ్ కూడా కొనాలి అమ్మకు ఇల్లు కట్టించాలి అని అనుకున్నాను. అందుకే ముందుగా ఇంటి గురించి అనుకున్నాను. ఒకప్పుడు ఇల్లు లేని సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిపారు మహేష్. ఇక కార్లు ఫ్రెండ్స్ అంటారా. సినిమా షూటింగ్ ఉంటే తప్పకుండా అసిస్టెంట్ కార్డులు వచ్చి పికప్ చేసుకుని వెళ్తాడు అలా అలా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇక నాకంటూ సొంతంగా ఒక చిన్న కారు ఉంది అది కూడా ఊర్లో. నా కూతురు నా భార్య మా అమ్మ వాళ్ళు తిరగడానికి మాత్రమే ఆ కారణం ఉపయోగిస్తాను అని చెప్పుకొచ్చాడు మహేష్. మరి షూటింగ్ కి ఎలా డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా అని అడగగా అవును అప్పుడప్పుడు బస్సులో వెళ్లి వస్తాను స్లీపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేస్తాను అని తెలిపారు మహేష్. ఇక అప్పుడప్పుడు స్నేహితులు కూడా వస్తూ ఉంటారు వారి కార్లలో కూడా వస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -