Rashmika: రష్మికకు బుద్ధి లేదా.. ఇంత పెద్ద తప్పు చేసిందా?

Rashmika: నేషనల్ క్రష్ రష్మికకు యూత్ లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయారామె. ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో రష్మికకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. ఇక ‘పుష్ప’తో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది.

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన యాక్ట్ చేసిన ‘పుష్ప’ చిత్రంతో రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆమె అందానికి, చలాకీ నటనకు, మెస్మరైజింగ్ డ్యాన్సులకు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో రష్మిక నటిస్తున్నారు. ఈ మూవీని మినహాయిస్తే తెలుగులో ఆమె మరో చిత్రంలో చేయడం లేదు. కోలీవుడ్ లో విజయ్ తో చేస్తున్న ‘వారసుడు’ మినహా మరో సౌత్ సినిమాలో రష్మిక నటించడం లేదు.

 

రష్మిక మందన్న పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ ఇటీవల రిలీజై ఫ్లాప్ గా నిలిచింది. దీంతో రష్మిక తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీపై పెట్టుకున్నారు. హిందీ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో చేస్తున్న ‘మిషన్ మజ్ను’ సక్సెస్ ను బట్టి రష్మిక కెరీర్ ఆధారపడి ఉంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. వరుస ఆఫర్లు వస్తుండటంతో బాలీవుడ్ లో సెటిలయ్యేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

దక్షిణాదిపై మరోమారు విమర్శలు
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన రష్మిక.. ఇప్పుడు ఏకంగా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడ ఖరీదైన ప్లాట్లు కొనుక్కున్న ఆమె మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే స్టార్ డమ్ వచ్చినప్పటి నుంచి ఆమె ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా కూడా సౌత్ సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి.

 

ఇలాగైతే కష్టమే..
‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్ లో భాగంగా హిందీ చిత్రసీమపై రష్మిక ప్రశంసలు కురిపించారు. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయని అన్నారు. దక్షిణాదిలో అన్నీ మాస్ మసాలా, ఐటమ్ సాంగ్సే ఉంటాయని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ వింటూ పెరిగానంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమెను తిరుగులేని స్టార్ గా నిలబెట్టిన సౌత్ మూవీస్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోతే కెరీర్ పతనం అయ్యేందుకు ఎంతో సమయం పట్టదంటూ సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -