Rashmika: రష్మికను బ్యాన్ చేస్తే ఇండస్ట్రీకి పట్టిన శని పోతుందా?

Rashmika: అతి తక్కువ సమయంలో అందనంత ఎత్తుకు ఎదిగిన కన్నడ సుందరి రష్మిక మందన్నా. తన అందాలు, అభినయంతో అద్భుతమైన నటనతో అభిమానులను కట్టిపడేసింది ఈ శ్రీవల్లి. ఇక పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. అభిమానుల క్రష్మిక గా పిలుచుకునే రష్మిక ఈ మధ్య లేనిపోని వివాదాల్లో చిక్కుకుంది. ఇక అత్యధిక ట్రోల్ అయిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచింది కూడా.

ఆ కామెంట్ వల్లే అన్ని సమస్యలు.
ఒకానొక దశలో కన్నడ ఇండస్ట్రీలో రష్మిక ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసారంటే ఈ అమ్మడు ఎంతగా ట్రోల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తనకు మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన రిషబ్ శెట్టి తీసిన కాంతారా మూవీ సూపర్ హిట్ అవ్వగా.. ఆ మూవీని రష్మిక చూడలేదని చెప్పడం అన్ని వివాదాలకు, ట్రోల్స్ కు కేంద్ర బిందువుగా మారింది. తనకు టైమ్ లేకపోవడం వల్ల కాంతారా మూవీ చూడలేదని గతంలో రష్మిక కామెంట్ చేసింది.

కన్నడిగులు రష్మికపై కోపంగా ఉన్న తరుణంలో ఈ భామను బ్యాన్ చేయాలనే వాదనపై భిన్నంగా స్పందించారు స్టార్ డైరెక్టర్ “నాగశేఖర్”. రష్మిక ను బ్యాన్ చేస్తే ఇండస్ట్రీకి పట్టిన శని వదిలిపోతుందనే వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్న సమయంలో ఈ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం తమన్నాతో “గుర్తుందా సీతాకాలం” సినిమా చేస్తున్న నాగశేఖర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో “ఒకరి నుండి మనమెప్పుడు కృతజ్ఞత కోరుకోకూడదు. రష్మిక ఏదో అందని ఆమెను బ్యాన్ చేయడం ఇండస్ట్రీకే నష్టం. నాతో చేసిన చాలా మంది ఇప్పడు స్టార్స్ అయ్యారు వారందరు నన్ను గుర్తు పెట్టుకోవాలని నేనెప్పుడూ అనుకోను. రష్మిక చాలా టాలెంటెడ్. తనను బ్యాన్ చేస్తే ఇండస్త్రీకే నష్టం” అని చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -