Rashmika: రష్మిక సినిమాలు బ్యాన్.. పుష్ప2 కు అన్ని రూ.కోట్ల నష్టమా?

Rashmika: రష్మిక మందనా ఇంకా కన్నడ సినిమాల్లో నటించే అవకాశం లేదా?.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త. గత కొద్ది రోజులుగా రష్మిక వార్తల్లో నిలుస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక.. పలు ఇంటర్వ్యూలో తాను నటించిన మొదటి కన్నడ సినిమా గురించి చెప్పకుండా మిగిలిన భాషల సినిమాల పేర్లు చెప్పడమే దానికి కారణం. కన్నడ పరిశ్రమని రష్మిక అగౌరవపరిచిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్మిక భారీగా ట్రోల్‌కు గురైంది. దాంతో రష్మిక సోషల్ మీడియాలో పెద్ద లేఖను రాసుకొచ్చింది. అయితే తాజాగా రష్మికను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచే నిషేధించినట్లు ప్రచారం జరుగుతోంది.

సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్విట్టర్ అకౌంట్‌లో రష్మిక మందనాను కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధించిందని పేర్కొన్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నారు. అయితే కర్ణాటకలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న చాలా గట్టిగా తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కన్నడలో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని అనుకున్నారు. అదే రూల్‌ను కన్నడీలు ఫాలొ అవుతారు. అలాంటిది ఇప్పుడు రష్మికపై డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యులు, సినీ పరిశ్రమకు చెందిన వారు మండిపడుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమను అగౌరవపరిచిందని.. ఆమెపై నిషేధం విధించాలని అంటున్నారు. అయితే రష్మిక ప్రస్తుతం.. రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. విజయ్‌తో నటిస్తున్న తమిళ చిత్రం ‘వారిస్’ కాగా, అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప-2’లో నటిస్తోంది. ఒకవేళ రష్మికపై నిషేధం విధిస్తే.. ‘వారిస్’ సినిమా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఈ సినిమా బ్యాన్ అయితే ఆ ప్రభావం పుష్ప-2పై కూడా పడుతుంది. అయితే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి సినిమా బ్యాన్ చేసే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -