Vijay-Rashmika: విజయ్ తో రిలేషన్ పై నోరు విప్పిన రష్మిక.. నిజమేనంటూ?

Vijay-Rashmika: తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతలా అభిమానిస్తారో, కొన్ని కాంబినేషన్లను కూడా అంత కన్నా ఎక్కువగా ఆదరిస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరో- హీరోయిన్ల కాంబినేషన్ విషయంలో అయితే తెలుగు ప్రేక్షకులు ఒక అడుగు ముందే ఉంటారు. తెలుగు తెర మీద అద్భుతమైన కెమిస్ట్రీని పండించే జంటల గురించి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వార్తలను వినాలని అనుకుంటూ ఉంటారు. వాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలని అనుకుంటారు.

 

ఇలా తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎక్కువగా తెలుసుకోవాలని తహతహలాడే ఓ క్రేజీ జంట తెలుగులో విజయ్ దేవరకొండ- రష్మిక మందన. ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ కాంబో అద్భుతమైన విజయాలను అందుకుంది. దీంతో ఈ జంట సినిమా చేస్తోందంటే వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. ఇదే సమయంలో ఈ జంట ఆఫ్ స్క్రీన్ హల్ చల్ చేయడం వార్తల్లో నిలుస్తోంది.

 

సినిమా ఫంక్షన్లు, సినిమాల వరకే కాకుండా ఈ జంట చాలాసార్లు మీడియాకు కనిపించడం, రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు లవ్ లో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని ఇద్దరు ఖండిచకపోగా.. లైట్ తీసుకోవడం కూడా చర్చకు దారి తీసింది.

 

కొత్త ఏడాదిలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో హీరోయిన్ రష్మిక మందన ఇచ్చిన ఓ హింట్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసింది. విజయ్ తో కాంబో గురించి రష్మిక చెప్పుకొస్తూ.. ‘నేను విజయ్ కలిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తాం’ అని క్రేజ్ అప్ డేట్ ఇచ్చింది. దీంతో రష్మిక సినిమా గురించి చెబుతోందా? లేదంటే తన లైఫ్ గురించి చెబుతోందా అనే చర్చ మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -