Ravi Teja: అయ్యో.. ధమాకా మూవీ సెన్సార్ టాక్ ఇలా ఉందా?

Maharaja Ravi Teja: మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అభిషేర్ అగర్వాల్ ఆర్ట్స్, పీఓప్లెక్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది. రవితేజ ఇందులో డబుల్ రోల్ లో నటిస్తున్నారు. శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది.

 

ధమాకా సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు మూవీకి U/A రేటింగ్ అందజేశారు. ఈ తరుణంలో సెన్సార్ సభ్యులు ధమాకా చిత్ర యూనిట్ ని అభినందించారు. ధమాకా సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. డిసెంబర్ 15న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

 

అయితే ధమాకా పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. అటు పాటలు, ఇటు టీజర్ బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి దండకాడియాల్ అనే సాంగ్ రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో పక్కా సూపర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించారు. అంతేకాదు స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాశారు.

 

ధమాకా సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగిందనే తెలుస్తోంది. దాదాపుగా 30 కోట్లకు పైనే బిజినెస్ జరిగినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూ.20 కోట్లు పలికినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వత రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -