Ravi Teja-Sreeleela: రవితేజను నాన్న అని పిలిచిన శ్రీలీల.. ఏమైందంటే?

Ravi Teja-Sreeleela: తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరోకి ఊహిచని విధంగా అవమానం ఎదురైంది. వయసు పైబడినా.. యంగ్ ఏజ్ హీరోయిన్లతో ప్రేమ కథా చిత్రాలు, రొమాన్సులు చేస్తున్నాడని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అదృష్టం బాగాలేక ఈ మధ్య తను నటించే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కచ్చితంగా ఉండాల్సిందేనని ఆ హీరో పట్టుబడుతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు మాస్ మహరాజా రవితేజ. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో హీరో రవితేజ ‘ధమాకా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. అయితే నిండా పాతిక కూడా వయసు దాటని హీరోయిన్‌తో రొమాన్స్ ఎలా చేస్తున్నాడని ఓ వర్గం వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ధమాకా సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా కం లవ్ స్టోరీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు కూడా విడుదలయ్యాయి. అయితే సినిమాలో తక్కువ వయసు ఉన్న హీరోయిన్‌తో నటించడంతో ఫిల్మ్ సర్కిల్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే హీరోని ఉద్దేశించి రచయిత (లిరిసిస్ట్) కూడా తెలివిగా ఓ పాటను రాశారు. ఈ పాటలో ‘నాన్న’ అనే పదాన్ని యాడ్ చేశారు. సింగర్ ఆ పాటను పాడేటప్పుడు లేట్ ఏజ్ హీరోయిన్‌ని ఎత్తి చూపేలా ఉంది.

 

కావాలనే లిరిసిస్ట్ సాంగ్ రాశాడని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ప్రోమోను చూసిన తర్వాత.. లిరిసిస్ట్ ఎంతో తెలివిగా ఆలోచించి ‘నాన్న’ పదాన్ని జోడించాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందని తెలుసుకునే లోపే అంతా పబ్లిసిటీ అయిపోయింది. అందుకే పలువురు వయసు తగ్గ స్టోరీలు సెలక్ట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. మరికొందరు డిగ్నిఫైడ్ సినిమాలు తీస్తే సరిపోతుందంటున్నారు. కానీ టీనేజీ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తే ఇంతో ఇబ్బందిగా ఉంటుందని, అందుకే సదరు లిరిసిస్ట్ కావాలనే ఇరికించాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -