Open Letter: తన అభిమాన నటుడికి ఓపెన్ లెటర్ రాసిన ఫ్యాన్. ఇంతకీ అసలు ఆ లెటర్లో ఏముందో తెలుసా?

Open Letter: వెండితెర మీద స్టార్ గా వెలగడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి, ఆటంకాలను దాటుకుంటూ పైకి ఎదిగితే కానీ ఓ స్థాయికి చేరుకోవడం ఈ ఫీల్డ్ లో కష్టం. పోనీ అంతా కష్టపడి పైకి ఎదిగాక వచ్చిన సక్సెస్ ఎప్పటికీ మనతో ఉంటుందా అంటే దానికి గ్యారెంటీ లేదు. మరి అలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుని పైకి ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజు రవితేజ ఒకరు.

కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి హీరోగా ఎదిగిన రవితేజ ఎన్నో మంచి చిత్రాలను చేసి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీతో ,పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో మాస్ హీరోగా రవితేజ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అతని మాస్ ఇమేజ్కు తగినట్లుగా సినిమాలు రవితేజ చేయడం లేదు అనేది అభిమానుల ఆవేదన. రొటీన్ యాక్షన్ మరియు కామెడీతో అతని చిత్రాలు ఉన్నాయి అనేది వాళ్ల నిరాశకు కారణం.

రీసెంట్గా రిలీజ్ అయిన ధమాకా కలెక్షన్స్ పరంగా పరలేదు అనిపిస్తున్న కథపరంగా రొటీన్ గా ఉంది అనేది అభిమానుల మనోభావం. ఈ మూవీ చూసి ఓ అభిమాని రవితేజాకు ఓపెన్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఆ లెటర్ నెట్లో బాగా వైరల్ అయింది. ఇంతకీ ఆ లెటర్ సారాంశం ఏమిటో చూద్దాం..

“రవితేజ సార్,

మీరు మారాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను. నన్ను మారు అనడానికి నువ్వు ఎవరివిరా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ వీర అభిమానిగా నాకు ఆ హక్కు ఉంది. ఒకప్పటి ఇడియట్ సినిమా టైంలో రవితేజ మాకు కావాలి. మీరు సినిమాలు తీసుకుంటూ పోతున్నారు కానీ ఒక్కసారైనా వెనక్కు తిరిగి ఆ సినిమాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటున్నారా? కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు కానీ సాయం పేరుతో మీకు మీరే చేసుకుంటున్న గాయం గురించి గమనించడం లేదు. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ అనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మీ ధైర్యానికి నేను అభిమానిని అయ్యాను.

చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ నిజాలు మారవు కదా. గత కొద్ది సంవత్సరాలుగా మీరు చేస్తున్న సినిమా పేర్లే గుర్తు ఉండడం లేదు అంటే ఆలోచించండి. మీ సినిమాలు జడ్జి చేసే అంత స్థాయి నాకు లేదు కానీ ఓ అభిమానిగా మిమ్మల్ని అందరికంటే పై స్థాయిలో చూడాలని స్వార్థంతో ఈ లెటర్ రాస్తున్నాను. మాస్ మహారాజుగా నీ ఎదుగుదల ఒక చరిత్ర.. దానికి ఎటువంటి మచ్చ రాకూడదనేది నా ఉద్దేశం. తిరిగి మిమ్మల్ని ఓ ఇడియట్ భద్రా విక్రమార్కుడు లాంటి సినిమాలు చేస్తూ ఉంటే చూడాలి అని కోరిక కలుగుతుంది. మొన్న రిలీజ్ అయిన ధమాకా చూశాక మీరు కచ్చితంగా మారాల్సిన టైం వచ్చింది అని అర్థమైంది. ఇవి మీ స్టాండర్డ్ కి చేయదగ్గ సినిమాలు కావు అనేది ఓ అభిమానిగా నా ఉద్దేశం.

ఇట్లు మీ వీరాభిమాని.”

ఎప్పటినుంచో ఎందరో అభిమానులు చెప్పాలనుకుని చెప్పలేని మాటను ఇప్పుడు ఇతను ఏకంగా లేఖ రూపంలో రాయడంతో చాలామంది హర్షం వ్యక్తీకరిస్తున్నారు. రవితేజ అభిమానులు ఎందరికో పాత రవితేజను చూడాలి అన్న కోరిక ఎప్పటినుంచో బలంగా ఉంది.మరి ఈ లేఖకు రవితేజ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -