Rayapati Sambashivarao: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీదే అధికారం.. బిగ్ బాంబ్ పేల్చిన మాజీ ఎంపీ

Rayapati Sambashivarao: వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది ఇప్పటినుంచే ఆసక్తి రేపుతోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. రాజకీయ పరిణామాలను బట్టి ఓటర్ల మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల సమస్యలపై ప్రతిపక్ష టీడీపీ చేసే పోరాటాలను బట్టి ఓటర్లు మారుతూ ఉంటారు. అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఇప్పుడే ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనేది ఫిక్స్ అవ్వరు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనేది ఫిక్స్ అవ్వుతారు. అప్పటి పరిస్థితులను బట్టి తమకు నచ్చిన పార్టీ వైపు మళ్లుతారు.

అయితే ఏపీలో ఇప్పటినుంచే ఎన్నికల సర్వేలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటినుంచే పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఏపీ ఎన్నికలపై జాతీయ మీడియా సంస్ధలతో పాటు లోకల్ మీడియా సంస్థలు సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ వైసీపీకి పట్టం కట్టగా.. లోకల్ మీడియా సంస్థలు మాత్రం టీడీపీ వైపు మళ్లాయి. జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వే ప్రకారం ఏపీలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగే వైసీపీదే అధికారమని తేల్చేశాయి. వైసీపీకి 15 నుంచి 18 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి. ఇక టీడీపీ 7 నుంచి 8 లోక్ సభ సీ్ట్లు వస్తాయని తెలిపాయి.

ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఇండియా టీవీ సర్వేల్లో వైసీపీనే గెలుపు అని వచ్చింది. ఇక లోకల్ గా ఆత్మసాక్షి, ఎన్డీటీ సర్వే మాత్రం ఏపీలో ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే అధికారమని తెలిపాయి. ఇక ఇటీవల వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాను స్వయంగా చేయించిన సర్వేను బయటపెట్టారు. ఈ సర్వేలో టీడీపీదే అధికారమని తేలింది. వైసీపీకి 70 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి మెజార్టీ సీట్లు వస్తాయని, ఇక జనసేనకు 5 లేదా 6 సీట్లు వస్తాయని ఆయన బయటపెట్టారు. ఈ క్రమంలో తాజగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బాంబ్ పేల్చారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు టీడీపీకి 175 స్థానాలకు గాను 125 స్థానాలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వైసీపీ పాలన పట్ల ప్రజలు విసిగివేశారి పోయినట్లు తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ది కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. విజయ్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు పేరు ఉందని, అందుకే ఆయన వైపే ప్రజలు చూస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే టీడీపీదే అధికారరమని రాయపాటి జోస్యం చెప్పుకొచ్చారు.

ఇక పొత్తులపై చంద్రబాబుదే తుది నిర్ణయమని రాయపాటి స్పష్టం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీపై రాయపాటి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని. తనకు టికెట్ ఇచ్చే విషయంపై చంద్రబాబుకు పూర్తి స్వేచ్చ ఉందన్నారు. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉన్నా తాను అంగీకరిస్తానని రాయపాటి తెలిపారు. 2014 ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుంచి రాయపాటి సాంబశివరావు ఎంపీగా పోటీ చేసి టీడీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీద ఓడిపోయారు.

అయితే రాయపాటి శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారెగ్యంతో బాధపడుతున్నారు. వయస్సు రీత్యా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో రాయపాటికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ నర్సరావుపేట పార్లమెంట్ టికెట్ చంద్రబాబు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓడిపోవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో రాయపాటి రాజకీయాలకు దూరమయ్యారు. ఈ మూడున్నరేళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న క్రమంలో రాయపాటి బయట వచ్చి రచ్చ లేపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -