Realme: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అత్యధిక ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్ మీ సంస్థ తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ఈ విడుదల చేయనుంది. రియల్‌మీ 10 ప్రో ప్లస్ ఫోన్ ను లాంచ్ చేసింది. మరి తాజాగా విడుదల అయిన రియల్ మీ 10 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ధర వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో రియల్ మీ సంస్థ తాజాగా కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. రియల్‌మీ 10ప్రో ప్లస్ పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 24,999 గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 25,999 గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ, హైపర్ కేస్ గోల్డ్ కలర్స్‌లో లభించనుంది.
ఈ ఫోన్‌ను 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ, అమోఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రూపొందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేకి 10 బిట్ ప్యానెల్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్‌ను అందించారు.