Realme: రియల్‌మీ.. మార్కెట్ లోకి 200 వాట్స్ చార్జింగ్ టెక్నాలజీ?

Realme: ప్రముఖ మొబైల్ కంపెనీ తన జీటీ నియో 5తో పాటుగా 240W ఛార్జింగ్‌ టెక్నాలజీని పరిచయం చేయబోతోంది. 2023, జనవరి 5న దాని లీప్‌ఫ్రాగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేయనుందట. కాగా రియల్‌మీ తన లీప్‌ఫ్రాగ్ టెక్నాలజీని ప్రదర్శించడానికి జనవరి 05 న చైనాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇది రియల్‌మీ జీటీ నియో 5 తో పాటు 240W ఛార్జింగ్ కావచ్చని అనుకుంటున్నారు. ఈ టెక్నాలజీ దిగ్గజం రాలీమె జీటీ నియో 5 కోసం 150W, 240W తో రెండు వేరియంట్‌లను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

అయితే అవి వరుసగా 5,00mAh, 4600mAh బ్యాటరీలను కలిగి ఉండవచ్చని సమాచారం. కాగా రియల్‌మీ 10ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన తాజా నంబర్ సిరీస్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేసింది. రియల్‌మీ 10 మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తుందని భావిస్తున్నారు. రియల్‌మీ 10 భారతదేశంలో విడుదల కానుందని రియల్‌మీ ఇండియా ట్వీట్ చేసింది. కానీ లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీని కూడా ప్రారంభించింది. రియల్‌మీ 10 5జీ ఇప్పుడు చైనాలో కూడా లభిస్తోంది. గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది.

 

ఇది 6.6 అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేతో అమర్చారు. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ రిజిన్ డౌజిన్, స్టోన్ క్రిస్టల్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో మనకు లభించనుంది. రియల్‌మీ 10 5జీ అనేది మిడ్ బడ్జెట్ కేటగిరీ ఫోన్. ఇది రెండు మోడళ్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 8జీబీ ర్యామ్ ని 128జీబీ స్టోరేజ్‌తో ప్యాక్ చేస్తుంది. దీని ధర CNY 1,299 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 14,700గా ఉంది. మరో మోడల్ 8జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది CNY 1,599 ధర అనగా సుమారుగా రూ. 18,000 గా ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -