Technology: రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్.. అత్యంత చవక ధరకే

Technology: ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. దీంతో మనుషుల పని త్వరగా పూర్తి అవుతుంది. టెక్నాలజీ వల్ల మానవాళికి చాలా ఉపయోగం జరుగుతోంది. ప్రస్తుతం టెలికాం రంగంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు చోటుచేసుంటున్నాయి. 4జీ టెక్నాలజీ నుంచి 5జీ టెక్నాలజీకి అప్డేట్ అవుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి రాగా.. త్వరలో భారత్ లోనూ 5జీ రానుంది.

దీంతో 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను తయారుచేసే పనిలో మొబైల్ తయారీ సంస్థలన్నీ నిమగ్నమయ్యాయి. ఇప్పటికే రిలయన్స్ జియో త్వరలో 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. రూ.12లలోపు ధరకే అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రియల్ మీ ఒక అడుగు ముందుకేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ 9ఐ 5జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది.

90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్ డీ, 50 మెగాపిక్సల్ కెమెరా ఫీచర్లతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.15 వేలుగా నిర్ణయించింది. మీడియాటెక్ డైమర్సిటీ 810 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల చేసింది. ఒకటి 4జీబీ+64 జీబీ వేరియంట్ కాగా.. రెండోవది 6జీబీ+128జీబీ వేరియంట్. 4జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉండగా.. 6జీవీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.

ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లేదా రియల్ మీ అధికారిక వెబ్ సైట్ realme.com ద్వారా ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యి డిస్కౌంట్ వస్తుంది. అలాగే రియల్ మీ వెబ్ సైట్ లో ఐసీసీసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.వెయ్యి ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల భిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -