Chandrababu Naidu: మోదీతో బాబు మళ్లీ దోస్తీ? టీడీపీ-బీజేపీ కలిసేనా?

Chandrababu Naidu: ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మళ్లీ దోస్తీ కుదురుతుందా? ఇద్దరి మధ్య స్నేహబంధం మరోసారి చిగురిస్తుందా? టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు మళ్లీ కుదురుతుందా? వచ్చే ఎన్నికల్లో మరోసారి కలిసి పనిచేస్తాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీలో శనివారం జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. దాదాపు 5 నిమిషాల పాటు ఏకాంతంగా మోదీ, చంద్రబాబు మాట్లాడుకున్నారు. వారిద్దరు ఏమి మాట్లాడుకున్నారనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వెళ్లిన తర్వాత మోదీ, చంద్రబాబు అసలు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత వీరిద్దరు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఏమి మాట్లాడుకున్నారో తెలియకపోయినా.. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య స్నేహాం మళ్లీ ఏర్పడిందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఏపీలో పొత్తుల గురించి చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మోదీ, చంద్రబాబు భేటీ ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత విషయాలపై మాట్లాడుకున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏమైనా ఇద్దరి మధ్య చర్చ జరిగిందా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీకి చంద్రబాబు కొద్దికొద్దిగా దగ్గర అవుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పలు అంశాల్లో మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని అసలు ఒక్క అంశంలో కూడా విమర్శించడం లేదు. టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించడం వెనుక కూడా చంద్రబాబు పాత్ర ఉందనే టాక్ నడిచింది. గతంలో టీడీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు ధర్మపోరాట దీక్షలతో మోదీపై విరుచుకుడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రతిపక్షాలను ఏకం చేసి మోదీపై యుద్దం ప్రకటించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన తర్వాత వెనక్కు తగ్గారు. మోదీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల మోదీ భీమవరం టూర్ కు కూడా టీడీపీకి ఆహ్వానం అందింది. తాజాగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు విషయంలో బీజేపీ కూడా సానుకూలంగా ఉందని అర్థమవుతుంది. తాజాగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు విజనరీ లీడర్ అని స్టేట్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు దార్శనికుడు కాబట్టే అమరావతికి కేంద్రం రూ.8500 కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. జగన్ దార్శనికుడు కాదు కాబట్టే మూడు రాజధానులకు నిధులు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసేలా కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -