Allu Sirish: అల్లు శిరీష్ సక్సెస్ కాకపోవడానికే అదే కారణమట!

Allu Sirish: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖుల వారసులు, కుటుంబం సభ్యులు సినిమాల్లో సెటిల్ అవ్వాలని అనుకున్నా.. సెటిల్ కాలేదు. చాలామంది సినీ ఇండస్ట్రీలో ఎంతో పరపతిని కలిగి ఉన్నా కానీ చివరకు తమ పిల్లలను సినిమాల్లో సక్సెస్ చేయలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో నటులతో పాట చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కమెడియన్లు కూడా ఉన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య నట వారసుడిగా వచ్చిన అల్లు అర్జున్ సినిమాల్లో విజయం సాధించాడు. గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేసిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఇదే కోవలో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా సినిమాల్లో రాణించాలని అనుకున్నాడు. కానీ ఆయన మాత్రం విఫలమయ్యాడు. ప్రేక్షకులు అతడి సినిమాలను ఆదరించకపోవడంతో.. సినిమాల విషయంలో ఆయన ఇంకా సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నాడు.

అయితే అన్న అల్లు అర్జున్ సినిమాలు సక్సెస్ అవడానికి, తమ్ముడు అల్లు శిరీష్ సినిమాలు హిట్ కాకపోవడానికి కొంతమంది పలు కారణాలను చెబుతున్నారు. ఈ కోవలో ముందుగా చెప్పేది.. నటన. అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ లో అయినా జీవిస్తాడని, దాని కోసం నటనా పరంగా బాగా కష్టపడతాడని కానీ అల్లు శిరీష్ అలా కాదని అంటారు. శిరీష్ ముఖంలో హావభావాలు పలకవని అంటారు.

ఇక అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్ కు పెట్టింది పేరు. తెలుగు ఇండస్ట్రీలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసే జాబితాలో టాప్ లో అల్లు అర్జున్ ఉంటాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం డ్యాన్స్ విషయంలో నిరూపించుకోలేకపోయాడు. ఇక అన్నింటికి మించి అల్లు అర్జున్ ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడని, సీన్ పండటానికి ఎంత కష్టాన్నైనా ఓపికగా సహిస్తాడట. కానీ అల్లు శిరీష్ మాత్రం అస్సలు ఓపిక పట్టడని, అందుకే పెద్ద డైరెక్టర్లకు ఈ విషయం అర్థమై.. అతడి దగ్గరికి కూడా ఎవరూ వెళ్లరట. మొత్తానికి అన్న నుండి అల్లు శిరీష్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని టాక్.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts