Nani: నాని దసరా మూవీకి షాకింగ్ రిజల్ట్ వెనుక కారణాలివేనా?

Nani: టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. విడుదల అయిన మొదటి రోజు ఎవ్వరూ ఊహించని విధంగా రూ.20 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డుని క్రియేట్ చేసింది. మిడ్ రేంజ్ హీరోల్లో ఈ ఫీట్ ను సాధించిన మొదటి హీరోగా నాని ఆల్ టైం రికార్డు సృష్టించాడు.

దాంతో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని మూవీ మేకర్స్తో పాటు అభిమానులు వ్యక్తం చేశారు. ఇదే ఊపులో సినిమా రూ.80 కోట్ల షేర్ ను రాబడుతుంది అని అంతా అంచనా వేశారు. అయితే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా రికార్డు కలెక్షన్స్ ని దసరా సినిమా బ్రేక్ చేస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు. 70 కోట్ల వరకు షేర్స్ ని రాబట్టిన గీతాగోవిందం కలెక్షన్స్ లను బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్ట లేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫైనల్ గా దసరా సినిమా రూ.65 కోట్ల షేర్ మార్క్ ను మించి కలెక్ట్ చేసే అవకాశం లేదని ట్రేడ్ పండితులు తేల్చి చెప్పేశారు. దాంతో గీత గోవిందం సినిమా రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయనుంది అన్న వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే సినిమా విడుదల రోజే మంచి సాధించిన ఈ సినిమా రాను రాను దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రేక్షకులను ఈ సినిమా ఊహించిన విధంగా గుర్తించలేకపోయింది. దాంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా కలెక్షన్ల పరంగా వెనకబడిపోయింది. ఇకపోతే గీత గోవిందం సినిమా రికార్డు ని అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా బ్రేక్ చేస్తుంది అంటూ చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

ఏప్రిల్ 28వ తేదీన ఏజెంట్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ కెరియర్ లో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా దసరా సినిమా కలెక్షన్స్ను వెనక్కి నెట్టేసి గీతాగోవిందం రికార్డుని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -