Vadde Naveen: నందమూరి ఫ్యామిలీ వల్లే వడ్డే నవీన్ కెరీర్ నాశనం అయ్యిందా!

Vadde Naveen: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి హీరో వడ్డే నవీన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు నిర్మాత వడ్డే రమేష్ వారసుడు. కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఊహించని స్థాయిలో తన నటనతో మెప్పించాడు. అనంతరం పలు ప్రేమ కథలకు సంబంధించిన సినిమాల్లో హీరోగా నటించి కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఆ క్రమంలోనే వడ్డే నవీన్ కి వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇక కెరీర్ పరంగా ఇతడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతుంది. అలాంటి సమయంలో వడ్డే నవీన్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. తనకి సినిమా ఆఫర్లు పూర్తిగా దూరమయ్యాయి. అయితే వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడని చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ కుమారుడైన రామకృష్ణ కుమార్తె చాముండేశ్వరిని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నాడు.

ఇక కుటుంబ కలహాల కారణంగా వీరిద్దరూ కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. ఈ ప్రభావం నవీన్ కెరీర్ పై పడిందని, అందుకనే తనకి సినిమా ఆఫర్లు కూడా రావడం లేదని అప్పట్లో ప్రచారాలు బాగా జరిగాయి. ఈ పుకార్లకు నవీన్ కూడా అప్పుడు స్పందించాడు. నా విడాకులు నా కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని, విడాకులు కారణంగా కొంతకాలం నుంచి నేను సినిమాలకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. వడ్డే నవీన్ విడాకుల తర్వాత సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు.

కానీ నందమూరి ఫ్యామిలీ వల్లనే వడ్డే నవీన్ కెరీర్ పూర్తిగా బోర్లా పడిందని అప్పట్లో బాగా ప్రచారాలు జరిగాయి. ఇక వడ్డే నవీన్ కెరీర్ విషయానికొస్తే అతడు 1997 లో సపోర్ట్ రోల్స్ చేస్తూ తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు. ఇక ఇతడి మొదటి చిత్రం కోరుకున్న ప్రియుడు సినిమా అయినప్పటికీ.. నటుడుగా మొదటి చిత్రం కాంతి. ఇది అతని తండ్రి సొంత బ్యానర్ లో నిర్మించబడింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -