Chiranjeevi: అలా చేస్తే మెగాస్టార్ హుందాతనం పెరుగుతుందిగా.. మౌనం మంచిది కాదంటూ?

Chiranjeevi:  టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులకు మంచికి కిక్ ఇచ్చారు.అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు ఈయన ఓ కార్యక్రమంలో పాల్గొనగా గరికపాటి మెగాస్టార్ మధ్య చోటు చేసుకున్న విషయం గురించి అందరికీ తెలిసిందే.

ఈ విషయంపై ఎంతోమంది మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇకపోతే నాగబాబు సైతం ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన మరికొంతమంది మాత్రం మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడటం కోసం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేస్తున్నారు.ఇలా ఈ వివాదాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం మౌనం వహిస్తున్నారు.

చిరంజీవి గారి గురించి ఎవరైనా ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేసిన ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా క్షణాల్లో ఆయన వరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే గరికపాటి విషయంలో ఎంతో మంది స్పందిస్తూ చిరంజీవికి మద్దతు తెలిపారు. ఇక ఈ వివాదం సద్దుమణిగింది అనే లోపు గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనంతరం వర్మ సైతం ఈ వివాదం పై స్పందిస్తూ వివాదాస్పద ట్వీట్లు చేశారు.

ఇలా ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం మౌనం వీడకుండా ఉన్నారు. అయితే ఇలా ఉండడం పూర్తిగా తప్పని మరికొందరు భావిస్తున్నారు.ఇకపోతే ఒక పండితుడు ఏదో పొరపాటున నోరు జారి మాట్లాడి ఉంటారు కానీ ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ..అభిమానులూ శాంతించండి.. ఆయ‌న్నేం అన‌కండి అంటే చిరు హుందాతనం ఎంతో పెరిగిపోయేది.కానీ ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి చూస్తూ ఉన్నారే తప్ప ఆయన మాత్రం స్పందించలేదు. ఇలా ఈయన స్పందించకపోవడానికి గల కారణం ఏంటో తెలియదు కానీ ఇలా చేయడం పూర్తిగా తప్పని మరికొందరు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -