Prabhas-Marathi: ఆ డైరెక్టర్ తో డార్లింగ్ సినిమా.. ప్రభాస్ అభిమానుల్లో భయం!

Prabhas-Marathi: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, భారీ హిట్ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు బ్లాక్ బాస్టర్ కాలేదు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. త్వరలో ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్ విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

ట్రైలర్ లో అనేక లోపాలున్నాయని, బొత్తిగా యానిమేషన్ లా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే రావణుడి గెటప్ గురించిన అభ్యంతరాలు కూడా చాలా వచ్చాయి. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తర్వాత డైరెక్టర్ మారుతీతో సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే, మారుతీ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని చెబుతుంటారు.

అయితే, భారీ స్టార్లను ఈ డైరెక్టర్ ఇప్పటిదాకా హ్యాండిల్ చేయలేదు. మారుతీ డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందులో భాగమే విక్టరీ వెంకటేశ్ తో తీసిన బాబు బంగారం సినిమా. తర్వాత గోపీచంద్ తో తీసిన పక్కా కమర్షియల్ సినిమా కూడా బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో సినిమా అంటే అభిమానులు హడలెత్తిపోతున్నారట. గతంలో ప్రభాస్ తో కలిసి మాట్లాడినప్పుడు మారుతీ చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చిందట. అందులోని హర్రర్, కామెడీ కోణాలపై డార్లింగ్ మనసు పడ్డాడట. అయితే, ప్రభాస్ తన కెరీర్ లో ఇలాంటి ప్రయోగాలు చేసి ఎరుగడు.

కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలిసింది. గతంలో మారుతికి ప్రేమ కథా చిత్రం.. సినిమా తీసిన అనుభవం ఉంది. అయితే, అది మీడియం రేంజ్ బడ్జెట్, చిన్న హీరో, నటీనటులు కూడా చిన్న స్థాయి ఆర్టిస్టులే. మరి ప్రభాస్ హీరోగా చేస్తున్నాడంటే మినిమం అంచనాలుంటాయి. అందుకే ఇలాంటి కొత్త సినిమా ప్రయోగం వద్దు బాబోయ్ అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -