Krishnam Raju: తెలుగు సినీ ప్రపంచానికి కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు టాలీవుడ్ లో నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. కృష్ణంరాజు మొదట తన కెరీర్ ను సహాయ పాత్రలతో ప్రారంభించాడు. ఆ తర్వాత విలన్ పాత్రల్లో కూడా తన నటనను ప్రేక్షకుల మరో స్థాయిలో పరిచయం చేశాడు. ఆ తర్వాత దర్శక నిర్మాతలు కృష్ణంరాజు నటనను గుర్తించి అతడిని హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు.
అప్పటినుంచి కృష్ణంరాజు ఎన్నో సినిమాల్లో కథానాయకుడుగా నటించి అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా స్టార్ హీరోగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రెబలియన్ కు సంబంధించిన సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా టాలీవుడ్ లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు కృష్ణంరాజు. ఇతడు నటుడు గానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కృష్ణంరాజు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంపీ స్థానాన్ని గెలిచి కేంద్ర మంత్రిగా తన సేవలో ఈ రాష్ట్రానికి అందించాడు. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో మరో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు ఇటీవల హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో మరణించాడు. కృష్ణంరాజు చనిపోయిన వార్తను ఈరోజు వరకు కూడా తన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. ఇక సెలబ్రెటీల నుంచి నార్మల్ పీపుల్స్ వరకు ఈ వార్తను ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టకు ముందు తనకి హీరో అవ్వాలనే కోరిక ఉండేదట. ఈ విషయాన్ని కృష్ణంరాజు తన స్నేహితులతో పంచుకోగా నీ మొహం నువ్వు హీరో ఏంట్రా అని తన స్నేహితులు హేళన చేశారట. ఇక కృష్ణంరాజు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు.. నెగిటివ్ గా కామెంట్ చేసిన తన స్నేహితులే.. కృష్ణంరాజుకు ప్రశంసల వర్షం కురిపించారట.