Tollywood: రికార్డు స్థాయిలో రిలీజులు.. ఏడాదికి వీడ్కోలు చెబుతున్న టాలీవుడ్!

Tollywood: ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చింది. కరోనా కారణంగా రెండేళ్లు థియేటర్లకు దూరమైన ప్రేక్షకులకు మస్తు మస్తు వినోదాన్ని అందించారు మన మేకర్స్, యాక్టర్స్. అయితే మునుపటిలా ఏ సినిమా పడితే ఆ సినిమాను చూసేందుకు మాత్రం ఆడియెన్స్ ఇష్టపడటం లేదని తేలిపోయింది. యావరేజీ చిత్రాలను కూడా దారుణంగా పక్కన పెట్టేస్తున్నారని కొన్ని ఫలితాలు చూస్తుంటే అర్థమవుతోంది. బొమ్మ బాగుంటే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు లేదా అట్టర్ ఫ్లాప్ చేస్తున్నారు.

 

ఈ సంవత్సరం డబ్బింగ్ సినిమాలతోనూ కలుపుకుంటే మొత్తంగా తెలుగులో 325 చిత్రాలు రిలీజయ్యాయి. ఇందులో కొన్ని ఓటీటీ విడుదలలను పక్కనబెట్టినా.. సుమారుగా 300 సినిమాలైతే నేరుగా థియేటర్లలో రిలీజయ్యాయి. వాటిలో సక్సెస్ అయినవి ఎంతనేది వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘బింబిసార’, ‘సర్కారు వారి పాట’ లాంటి డైరెక్ట్ మూవీస్ సూపర్ హిట్టయ్యాయి.

 

‘విక్రమ్’, ‘సర్దార్’, ‘కాంతార’, ‘అవతార్ 2’ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దండిగా వసూలు చేశాయి. ఇక ఈ ఏడాదికి ఏకంగా 10 సినిమాలతో బైబై చెబుతోంది తెలుగు చిత్రసీమ. డిసెంబర్ నెలలో చిన్నాచితకా అన్నీ కలుపుకుంటే పదికి పైగా సినిమాలు రిలీజయ్యాయి. నెలాఖర్లో చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

 

చివర్లో వస్తున్న పవర్ స్టార్ మూవీ!
‘18 పేజెస్’, ‘ధమాకా’ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతోపాటు ‘అవతార్ 2’, ‘లాఠీ’, ‘కనెక్ట్’ వంటి డబ్బింగ్ మూవీస్ కూడా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘బటర్ ఫ్లై’ మూవీ ఈ నెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తర్వాతి రోజున ఆది సాయికుమార్ యాక్ట్ చేసిన ‘టాప్ గేర్’తోపాటు నందమరి తారకరత్న ‘ఎస్–5’, సోహెల్ ‘లక్ష్మీ లక్ష్మణ్​’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటితోపాటుగా ‘రాజయోగం’, ‘ఉత్తమ విలన్’, ‘నువ్వే నా ప్రాణం’ లాంటి ఛోటా మూవీస్ కూడా ఆడియెన్స్ ముందుకొస్తున్నాయి. ఐశ్వర్యా రాజేశ్ నటించిన తమిళ సినిమా ‘డ్రైవర్ జమున’ తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 30న వస్తుండటం విశేషం. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’ మూవీ 31వ తేదీన రీరిలీజ్ కాబోతోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -