Nizamabad: పెళ్లికి నో చెప్పిన మరదలు.. యువకుడు చేసిన పనికి షాక్?

Nizamabad: ఈ మధ్య కాలంలో చాలామంది యువత ప్రేమించుకొని చెట్టాపట్టాలేసుకొని తిరిగి పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి చివర్లో పెళ్లి ఊసు ఎత్తగానే పెళ్ళికి నో చెబుతున్నారు. దాంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుండగా ఇంకొందరు, తమకు దక్కని వారు ఇతరులకు కూడా దక్కకూడదు అన్నా కోపంతో వారిని చంపి వాళ్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బావ మరదలు ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు.

కానీ ఆమె చివరి నిమిషంలో మాట మార్చడంతో అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా బ్రహ్మణపల్లి మండలం జక్రన్ పల్లి పరిధిలోని గాంధీ నగర్ ప్రాంతంలో రవితేజ అనే 26 ఏళ్ళ యువకుడు నివసిస్తున్నాడు. ఇతనికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో మేన మరదలు ఉండేది. అయితే ఇద్దరూ గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఆ యువతి రవితేజతో మాట్లాడడం మానేసింది. పెళ్లి కూడా చేసుకోనని చెప్పినట్లు తెలుస్తోంది.

 

అయితే మరదలు పెళ్లికి నో చెప్పడంతో రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అస్సలు స్పందించలేదు. దాంతో రవితేజ చేసేదేమి లేక తాజాగా తెల్లవారుజామున ఆ యువతి ఇంటికి వెళ్లాడు. మరదలిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ అత్తమామలు నిరాకరించారు. దాంతో రవితేజ మరదలు ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ యువకుడు పూర్తిగా కాలి మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరదలి కోసం రవితేజ చనిపోవడంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -