Baby Shamili: టాలీవుడ్ ప్రేక్షకులకు ఓయ్ సినిమాలో హీరో సిద్ధార్త్ సరసన నటించిన బేబీ షామిలి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఓయ్ సినిమా తో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. కానీ ఈ బేబీ షామిలి దేని కారణంగానో మరి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఆ తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. నిజానికి బేబీ షామిలి తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ సినిమాలో నటించి నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఆమె భారత దేశంలో కేరళ రాష్ట్రంలోని తిరువళ్లలో జన్మించింది. ఈమె తండ్రి పేరు బాబ్. ఇక తల్లి పేరు ఆలిస్ ఈమె గృహిణి. ఈమెకి రిచర్డ్ రిషి అనే అన్నయ్య కూడా ఉన్నాడు. 1990లో కేవలం రెండు సినిమా రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అంజలి సినిమాలో నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది.
ఇక చాలా కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న షామిలి ప్రస్తుతం ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగశౌర్య దర్శకత్వంలో వస్తున్న పవన్ సుందర్ తో కలిసి మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఈ సినిమాలో కథానాయకగా నటించమని ఈ మూవీ మేకర్స్ ఆఫర్ చేశారట. దాంతో షామిలి కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ అమ్మడు ఈ సినిమాలో నటించిన కొత్త లుక్ కోసం ట్రై చేస్తుందట. దానికోసం అనేక రకాల వ్యాయామాలు చేస్తుండట.
ఇదంతా పక్కన పెడితే.. ఈ షామిలి కి కొలీవుడ్ లో ఒక స్టార్ హీరో సొంత బావ అవుతాడు. అది ఎవరని ఆలోచిస్తున్నారా? ఇంతకు అది ఎవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. అజిత్ షామిలి కి సొంత బావ అవుతాడట. షామిలి కూడా పలు ఇంటర్వ్యూలో వాల బావ అజిత్ గురించి కొన్ని అసత్యమైన విషయాలు పంచుకుంది. మరి చాలాకాలం తర్వాత టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న షామిలి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడండి.