Charles: 9 దేశాల్లో 20 మందికి పైగా హత్యలు చేసిన చార్లెస్ విడుదల?

Charles: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నేరస్తులు తప్పు చేసి కూడా బయట తిరుగుతున్నారు. అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. సాధారణంగా సమాజంలో కొంతమంది నేరస్తుల పేర్లు చెబితే భయపడటం లేదంటే కోపంతో రగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిలో చార్లెస్ శోభరాజ్ పేరు కూడా ఒకటి. చాలామంది చార్లెస్ శోభరాజ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ బికినీ కిల్లర్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ చార్లెస్ అనే వ్యక్తి ఒక సీరియల్ కిల్లర్. ఇతని కోసం ఏకంగా తొమ్మిది దేశాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

తొమ్మిది దేశాల్లో హత్యలు చేసిన చార్లెస్‌ శోభరాజు గత 19 ఏళ్లుగా హత్యా నేరం కింద నేపాల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుడు కావడంతోనేపాల్‌ కోర్టు అతడి విడుదలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. శోభరాజ్ ప్రస్తుతం నేపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతడిని 15 రోజుల్లోగా తన దేశానికి పంపించాలని నేపాల్ సుప్రీం కోర్టు అధికారులను ఆదేశించింది. దాంతో మరొకసారి చార్లెస్ నేర చరిత్ర విలువలోకి వచ్చింది. అయితే అతని నేర చరిత్ర తెలిసిన చాలామంది అతడిని ఉరిశిక్ష వేయకుండా ఎందుకు శిక్షించారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చార్లెస్ కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.

 

వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్న రోజు దొంగలించిన కారులు తిరుగుతూ పట్టుబడడంతో చార్లెస్ జైలుకి వెళ్ళాడు. ప్రియుడు కోసం ఆమె జైలు నుంచి బయటికి వచ్చేవరకు ఎదురుచూసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ తన బుద్ధిని మార్చుకోకుండా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ దాదాపుగా తొమ్మిది దేశాల్లో నేరాలకు పాల్పడ్డాడు.
భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం పోలీసులు ఎదురు. 70వ దశకంలో చార్లెస్ ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో పొడవడం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో సజీవదహనం ద్వారా బాధితులకు దగ్గరయ్యి వారిని హత్య చేసేవాడు. బీచ్‌లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. దీంతో చార్లెస్‌ను బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -