Serial Actress: సీరియల్ హీరోయిన్స్ పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Serial Actress: తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతలా ఆదరిస్తారో, వాటికి తీసిపోని విధంగా సీరియల్స్ ని కూడా ఆదరిస్తారు. మరీ ముఖ్యంగా తెలుగు మహిళలు అయితే సినిమాలకు బ్రహ్మరథం పడుతుండటం తరుచుగా మనం చూస్తేనే ఉంటాం. సాయంత్రం వేళ ఇంట్లోని ఆడవాళ్లంతా సీరియల్స్ కి అతుక్కుపోవడం ప్రతి ఇంట్లో సాధారణమైపోయింది. కార్తీకదీపం అని, ఆడదే ఆధారం అని, చంద్రముఖి అని ఇలా రకరకాల సీరియల్స్ ని మహిళలు ఆదరిస్తున్నారు. అయితే ఈ సీరియల్స్ లో మెచ్చించిన నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ప్రేమి విశ్వనాథ్: తెలుగులో బాగా పాపులర్ అయిన ‘కార్తీకదీపం’ సీరియల్ లో వంటలక్కగా పేరు పొందింది ప్రేమి విశ్వనాథ్. డీగ్లామర్ రోల్ లో అందరి చేత కంటతడి పెట్టించే ఈ వంటలక్క ఒక్క రోజుకు రూ.25వేల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందని సమాచారం.

నవ్య స్వామి: తెలుగు సీరియల్స్ లో మంచి గ్లామర్ ఉన్న నటీమణి ఎవరని అడిగితే చాలామంది నవ్యస్వామి పేరు చెబుతారు. ఆమె కథ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నవ్యస్వామి.. ఇప్పుడు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. ఈమె ఒక రోజుకు రూ.20వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

ఐశ్వర్య: మహిళల చేత బాగా ఆదరణ పొందిన మరో సీరియల్ అయిన అగ్నిసాక్షిలో చేసిన ఐశ్వర్యకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక్కరోజుకు రూ.20వేల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటోందట.

సుహాసిని: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, అక్కడ వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెర మీద సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన సుహాసిని రోజుకు రూ.20వేల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందట.

పల్లవి రామిశెట్టి: బుల్లితెర అనుష్కగా పేరు తెచ్చుకున్న పల్లవి రామిశెట్టికి ఆడదే ఆధారం సీరియల్ మంచి పాపులారిటీని తెచ్చింది. ప్రస్తుతం పల్లవి రోజుకు రూ.15వేల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందట.

వీరితో పాటు సీరియల్ నటీమణులైన అషికా (కథలో రాజకుమారి ఫేం), హరిత (కుంకుమపువ్వు, ముద్దమందారం ఫేం)లు రోజుకు రూ.12వేలు, సమీరా షరీఫ్, ప్రీతినిగమ్ లు రూ.10వేలు, చంద్రముఖి సీరియల్ ద్వారా పాపులర్ అయిన మంజులలు రూ.8వేల వరకు ఒక రోజుకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -