Revanth: ఆ ఘటన రేవంత్ భార్యను ఇంతలా బాధ పెట్టిందా?

Revanth: బిగ్‌బాస్ సీజన్-6 చివరి దశకు చేరుకుంది. ఫైనల్స్ కు మరో మూడు వారాలు మాత్రమే మిగిలాయి. దీంతో కంటెస్టెంట్లు ఎలాగైనా టైటిల్ కొట్టాలనే తెగ ప్లానులు చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన వారిలో ‘సింగర్ రేవంత్’ ఒకరు. ఈ సారి ఎలాగైన టైటిల్ కొట్టాలని ముందు నుంచే పక్కా ప్లాన్‌తో గేమ్ ఆడుతున్నాడు. అయితే రేవంత్ బిగ్‌బాస్‌లోకి వచ్చే ముందే అతడి భార్య గర్భవతి అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను బిగ్‌బాస్‌ షోలో ప్లే చేశారు. అప్పుడు రేవంత్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రేవంత్ ఆటతీరు, తదితర విషయాలపై అతని భార్య అన్విత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

 

టాలీవుడ్ సింగర్ రేవంత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. మొదటి నుంచే రేవంత్‌కు ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ అందుతుందనే చెప్పుకోవచ్చు. ఆయా టాస్క్ లలో నిరాశపర్చినప్పటికీ.. జనాల్లో ఉన్న సపోర్టును మాత్రం కోల్పోలేదు. అలా అత్యధిక ఓట్లు అందుకున్న కంటెస్టెంట్లలో రేవంత్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రేవంత్‌కు పోటీగా ఉన్న వాళ్లు అతడిపై తప్పుడు ప్రచారాలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ రేవంత్ పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ క్రమంలో రేవంత్ భార్య అన్విత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ స్రవంతి ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ.. ఈరోజు ఒక బ్యూటిఫుల్ సోల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చాను. తను ఎవరో కాదు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ రేవంత్ సతీమణి అన్విత.’ అని చెప్పుకొచ్చింది. స్రవంతి.. అన్వితను ప్రశ్నిస్తూ.. ‘సీమంతం సమయంలో భర్త పక్కన లేనప్పుడు ఏమైన బాధపడ్డారా?’ అని అడుగుతుంది. దానికి అన్విత.. ‘ఫ్యామిలీ అంతా ఉంది. వారి సమక్షంలోనే జరిగింది.’ అని బదులిచ్చింది. ‘మీ సీమంతం గ్లింప్స్ ను రేవంత్‌కు చూపించారు. ఆ ఎపిసోడ్ చూసినప్పుడు మీకెలా అనిపించింది.’ అని స్రవంతి అడిగింది. దానికి అన్విత మాట్లాడుతూ.. ‘ఎపిసోడ్ చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. సీమంతానికి రేవంత్ పంపిన గాజులనే వేసుకున్నాను.’ అని ఎమోషనల్ అయింది. ప్రతి టాస్క్ లో రేవంత్ తన బెస్ట్ ఇస్తాడని, బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ రేవంతేనని అన్విత చెప్పుకొచ్చింది. కాగా, రేవంత్ కూడా టైటిట్ గెలిచి.. పుట్టబోయే బిడ్డకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -