Revanth: తండ్రిగా ప్రమోట్ అయిన రేవంత్.. అక్కడ కూడా విన్నర్ అవుతారా?

Revanth:తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో టైటిల్ రేస్ లో ముందు వరుసలో ఉన్న టాప్ కంటెస్టెంట్ ఎవరంటే సింగర్ రేవంత్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు ముందు నుండి పరిచయం ఉన్న సింగర్ రేవంత్.. బిగ్ బాస్ హౌజ్ లో తనదైన స్టైల్ తో ఆడుతూ అందరినీ అలరిస్తున్నాడు.

గేమ్ ను ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో అద్భుతంగా ఆడుతున్న సింగర్ రేవంత్ కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే రేవంత్ కు సంబంధించిన ఓ శుభవార్త అందరికీ సంతోషం కలిగిస్తోంది. సింగర్ రేవంత్, అన్విత దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. అన్విత ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అకౌంట్ ద్వారా వెల్లడించింది.

తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ సింగర్ రేవంత్ చాలాసార్లు ఎమోషనల్ అవడం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్లోకి రేవంత్ అడుగుపెట్టినప్పుడు ఆయన భార్య నిండు గర్భిణి. అతడు హౌజ్ లో ఉండగానే ఆమె శ్రీమంతం జరగగా.. ఆ వీడియోను బిగ్ బాస్ లోని రేవంత్ కు చూపించగా అతడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

ఇప్పుడు అతడికి పాప పుట్టిందనే విషయం తెలిస్తే ఎంతో ఆనందంగా ఫీలవుతాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్న రేవంత్.. బిగ్ బాస్ కంటే ముందే గుడ్ న్యూస్ వినేశాడు. మరి ఇంటికి రేవంత్ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ తో వెళతాడా అనేది ఆసక్తికరంగా మారింది. తండ్రిగా ప్రమోట్ అయిన రేవంత్.. టైటిల్ కూడా విన్ అవుతాడని అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతడిని విష్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -