RGV: శ్రీరెడ్డిపై వర్మ దిగజారుడు వ్యాఖ్యలు మీరు విన్నారా?

RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఎలాంటి విషయాన్నైనా నిర్మోహమాటంగా చెబుతుంటారు. సొసైటీ గురించి పట్టించుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంటారు. ఆ విషయంపై మీడియా, సమాజం, ఏం అనుకుంటారో అని కొంచెం కూడా ఆలోచించరు. మొదటి నుంచే తనకు నచ్చిన పనులు చేస్తూ.. నచ్చింది మాట్లాడుతూ వస్తున్నారు. ఆర్జీవీ ఎలాగో.. నటి శ్రీరెడ్డి కూడా అంతే.. ఆమె కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. నచ్చినట్లు బతుకుతోంది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగానే అనేస్తుంటుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

 

 

అయితే గతంలో రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. ఎన్నికలప్పుడు ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఆర్జీవీ.. శ్రీరెడ్డిపై సంచలన కామెంట్లు చేశాడు. ఇంటర్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ఎన్నికల హడావిడి ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు ఈ ఎన్నికలప్పుడే మా అసోసియేషన్ ఉందనే విషయం తెలిసింది. ఇండస్ట్రీకి ఉపయోగపడని దానికి సపరేట్ బిల్డింగ్ ఎందుకో కూడా తెలియడం లేదు. అసలు నా దృష్టిలో మా అసోసియేషన్ ఎన్నికలు జరగకున్న పెద్ద ఉపయోగం ఉండదు.’ అని చెప్పారు.

 

 

మీకు శ్రీరెడ్డి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించగా..‘మొదట్లో నాకు శ్రీరెడ్డి ఎవరో కూడా తెలియదు. క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యతిరేకించినప్పుడు ఆమె బహిరంగంగా చీర విప్పింది. అప్పుడే ఆమె గురించి తెలిసింది. మా ఎన్నికల్లో కూడా ఆమె దూకుడు ప్రదర్శించింది.’ అని సంచలన కామెంట్లు చేశాడు. కాగా, ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్లు నెట్టింట మరోసారి వైరల్ అయ్యాయి. అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ బరిలో నిలిచారు. అప్పట్లో ఆర్జీవీ.. ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి అధ్యక్ష పదవిని ఛేజిక్కించుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Youth Turns as GIG Workers: హైదరాబాద్ లో గిగ్ వర్కర్లుగా లక్షల సంఖ్యలో ఏపీ యువత.. ఈ పరిస్థితి దారుణమంటూ?

AP Youth Turns as GIG Workers: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశం ఏర్పరచగా అందులో సకానికి పైగా ఆంధ్రప్రదేశ్ యువత వున్నది అని తెలిసింది....
- Advertisement -
- Advertisement -