Rich: కలలో ఈ ఏడు పక్షులు కనిపిస్తే చాలు.. ఆకస్మిక ధన లాభం?

Rich: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కలలలో,పక్షులు జంతువులు,వస్తువులు మనకు ఇష్టమైన వ్యక్తులు ఇలా ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో కనిపించే విషయాలు భవిష్యత్తు సంఘటనలకు సంకేతాలుగా పరిగణిస్తారని చెబుతూ ఉంటారు. కలలో కొని శుభప్రదమైనవి మరికొన్ని అశుభాలు చూపించేవి కూడా వస్తూ ఉంటాయి. అయితే కలలో కొన్ని రకాల పక్షులను అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల పక్షులు చూడడం శుభప్రదంగా పరిగణిస్తారు. మరి ఎటువంటి పక్షులను చూడటం వల్ల మంచిది దాని వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కలలో నెమలి కనిపించినట్లయితే జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. అయితే కలలో మామూలు నెమలి కాకుండా తెల్ల నెమలి కనిపించడం ఇంకా శుభప్రదం అని చెప్పవచ్చు. కలలో శని దేవుడు నెమలిపై కూర్చుని దర్శనం ఇస్తే త్వరలోనే చేతికి డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని అర్థం. కలలో చిలుక కనిపిస్తే శుభప్రదంగా భావించవచ్చు. చిలుక కనిపించడం వల్ల ఇంటికి కొత్త అతిథులు వస్తారని, అలాగే లేని వారికి కలలో చిలుక కనిపిస్తే దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుందని అర్థం. అలాగే కలలో నీలకంఠ పక్షిని చూడటం శుభసంకేచంగా భావించవచ్చు. నీలకంఠ పక్షి కనిపించడం వల్ల జీవిత భాగస్వామిని కనుగొంటారు అని అర్థం.

అలాగే కలలో కనిపించడం లేదంటే నీటిలో తేలి ఆడుతున్న రెండు హంసల జంట కనిపించడం శుభప్రదం. అలా కనిపిస్తే మీ ఇంటిలో కొన్ని శుభకార్యాలు అలాగే ఆర్థిక లాభాలకు సంకేతంగా భావించవచ్చు. అలాగే కళ్ళలో నల్ల హంస లేదా చనిపోయిన హంస కనిపిస్తే దానిని ఆ శుభంగా భావించాలి. కలలో కొంగ కనిపిస్తే వ్యాపారంలో లాభం ఉద్యోగంలో పురోగతి ఆకస్మిక ధన లాభం వస్తుందని అర్థం. ఆకాశంలో ఎగురుతున్న కొంగలను దాన్యం తింటున్న కొంగలను చూడటం మంచిది. కలలో పిచ్చుకలు కనిపించడం శుభప్రదం. ఇది ఆనందానికి శ్రేయస్సుకు సంకేతం అని చెప్పవచ్చు. అలాగే కలలో గుడ్లగూబని చాలా శుభప్రదం అని చెప్పాలి. ఎందుకంటే కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే లభిస్తుందని అర్థం. అంతేకాకుండా డబ్బు సంపాదించడానికి సంకేతంగా కూడా భావించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -