Rishab Shetty: టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ అంటే ఇష్టం: రిషబ్ శెట్టి

Rishab Shetty: ప్రముఖ కన్నడ సినిమాకి రీమేక్ తెరకెక్కిన “కాంతర” సినిమా ఇటీవల తెలుగులో విడుదలై మంచి హిట్ అందుకుంది. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా దర్శకుడిగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి రూపొందించిన తాజా చిత్రం కాంతారావు ఇటీవల అన్ని భాషలలో విడుదలై ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వస్తువులు సొంతం చేసుకుంటుంది.ఇటీవల తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదల చేశారు. కేరళలోని కాంబ్లా, బూటాకోలా సంప్రదాయ సంస్కృతిని తెలియజేస్తూ రూపొందించిన ఈ సినిమాకి కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి.. ప్రధాన పాత్రలో నటించారు.

ఇటీవల తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తన అభిమాన హీరో అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ కి తనకి మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కర్ణాటకలోని ఉడిపిలో గల కుందపుర గ్రామానికి చెందిన రిషబ్ శెట్టి కి ఎన్టీఆర్ తో ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్ తల్లి జన్మస్థలం కూడా ఉడిపిలో గల కుందపుర గ్రామం. ఈ విధంగా వారిద్దరికీ మధ్య కామన్ కనెక్షన్ ఉందని రిషబ్ శెట్టి తెలియజేశాడు. ఇక మరొక సందర్భంలో ఎన్టీఆర్ తో సినిమా గురించి యాంకర్ ప్రశ్నించగా.. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts