Rishabh Pant: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కార్ యాక్సిడెంట్ కు గురికావడం తెలిసిందే. ఢిల్లీ నుండి తన ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న రిషబ్ పంత్ కారు.. హమ్మడ్ పూర్ ఝాల్ (ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో) వద్ద ప్రమాదానికి గురైంది. రిషబ్ పంత్ తన బీఎండబ్లూ కారులో ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్ లోని విజువల్స్ ప్రకారం రిషబ్ పంత్ నడుపుతున్న బీఎండబ్లు కారు చాలా వేగంగా వచ్చి డివైడర్ ని డీకొట్టడం కనిపించింది. అలాగే సుశీల్ కుమార్ అనే స్థానికుడు ఆ సమయంలో అక్కడే ఉండగా.. అతడి గొంతు కూడా ఫుటేజ్ లో కనిపించింది. దుబాయ్ నుండి తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సర్ ప్రైజ్ చేయాలని రిషబ్ పంత్ అనుకొని, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే మీదుగా కారులో ఇంటికి ప్రయాణం కాగా.. మార్గమధ్యమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్ విండ్ స్క్రీన్ ను పగలగొట్టుకొని బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా దగ్గరలోని రూర్కెలా సివిల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుండి డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి అతడిని తరలించారు. కాగా పంత్ కారు ప్రమాదంపై పోలీస్ అధికారులు స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉదయం గం.5.30 నుండి గం.6ల మధ్యలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. గాయాలతో ఉన్న పంత్ ను ఆస్పత్రికి తరలించగా.. వైద్య సిబ్బంది అతడిని వెంటనే డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రిషబ్ పంత్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిద్రలోకి జారుకున్నాడని, అందుకే అతడి కారు ప్రమాదానికి గురైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
Rishabh Pant has survived a serious car accident on Delhi-Dehradun highway. He’s been shifted to the hospital in Delhi.
He was coming home to surprise his mother and there was a plan to hand out with his mother and family on the occasion of New Year.#RishabhPant
ऋषभ पंत pic.twitter.com/T1eiJK0uhq— Kaustubh Pandey (@KaustubhP26) December 30, 2022