Rohit sharma: సెమీస్‌కు ముందు హిట్‌మ్యాన్‌కు గాయం.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడతాడా..?

Rohit sharma: టీ20 ప్రపంచకప్ లో ఈనెల 10న అడిలైడ్ ఓవల్ వేదికగా కీలక మ్యాచ్ ఆడనున్న టీమిండియాకు భారీ షాక్. సూపర్-12 ముగించుకుని గ్రూప్-2లో టాపర్ గా సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత జట్టు.. సెమీస్‌లో పటిష్ట ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ నెట్స్ లో గాయపడ్డాడు.

 

సెమీస్‌కు ముందు అడిలైడ్ లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మంగళశారం ఉదయం నెట్స్‌కు వచ్చిన రోహిత్ శర్మ ప్రాక్టీస్ సందర్బంగా గాయపడ్డాడు. త్రోబాల్స్ వేస్తుండగా ఒక బంతి బలంగా వచ్చి రోహిత్ మోచేయిని తాకింది. అయితే అది పెద్ద గాయం కాదనుకున్న హిట్‌మ్యాన్.. తర్వాత బంతిని వేయాలని సూచించాడు. కానీ నొప్పితో విలవిల్లాడుతూ నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. టీమ్ ఫిజియో, సపోర్ట్ స్టాఫ్ కలిసి రోహిత్ ను అక్కడ్నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. సుమారు గంటన్నర వరకు రోహిత్ మళ్లీ బ్యాట్ పట్టలేదు.

 

అయితే కొంతసేపు విరామం తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ సెషన్స్ కు వచ్చాడు. రెండు బ్యాట్లను చేతిలో పట్టుకుని నెట్స్ లోకి అడుగుపెట్టిన హిట్ మ్యాన్.. కాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికైతే రోహిత్ గాయం పెద్దది కాదని టీమ్ మేనేజ్మెంట్ వర్గాలు చెబుతున్నా ఇంగ్లాండ్ తో మ్యాచ్ సమయం కల్లా గాయం తిరగబెడితే అది భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బే.

 

ఈ టోర్నీలో రోహిత్ ఇప్పటివరకు నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో మినహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వేలతో విఫలమయ్యాడు. భారత్ మ్యాచ్ లు గెలుస్తుండటంతో ఎవరూ హిట్ మ్యాన్ బ్యాటింగ్ పై పెద్దగా పట్టించుకోనప్పటికీ అతడి ఫామ్ ఆందోళనకరంగానే ఉందనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అయినా హిట్ మ్యాన్ రాణించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఈనెల 10న అడిలైడ్ వేదికగా రెండో సెమీస్ జరుగనున్న విషయం తెలిసిందే. అంతకుముందు పాకిస్తాన్-న్యూజిలాండ్ లు నవంబర్ 9న తొలి సెమీస్ ఆడతాయి. సెమీస్ మ్యాచ్ లలో గెలిచిన విజేతలు ఈనెల 13న ఫైనల్ లో తలపడతాయి.

 

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -