Rohith Sharma: రోహిత్ శర్మ కి సవాలు విసురుతున్న యువ ఆటగాళ్లు!

Rohith Sharma: భారత క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడో 2013 మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మనం కప్ కొట్టాం. తరువాత మనం ఆ స్థాయి ఆట ఆడలేకపోయాం.మొన్నటి టీ20 ప్రపంచ కప్ లో కూడా మనకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రసుతం అందరి దృష్టి 2023 వన్డే ప్రపంచ కప్ మీద ఉంది.టీ20 వరల్డ్ కప్ లో మన ఓపెనర్లు తేలిపోయారు. సరైన స్టార్ట్ ఇవ్వడంలో విఫలం అయ్యారు. విరాట్ కోహ్లీ,సూర్య కుమార్ యాదవ్, హార్దిక పాండ్య ఆదుకోవడంతో మనం సెమీస్ వరకూ వెళ్లగలిగాం.

రోహిత్ శర్మ జర భద్రం!
ఓపెనర్ల గురించి బాగా చర్చ నడుస్తున్న సమయంలో కొంత మంది ఆటగాళ్లు రోహిత్ శర్మ స్థానానికి ఎసరు పెట్టే దిశగా ఆడుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

రుతురాజ్ గైక్వాడ్: ఐపీఎల్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇటీవల ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. డబుల్ సెంచరీకి తోడు రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్ లో 7 సిక్సులు బాదాడు. ఇతను జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇషాన్ కిషన్: ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు కొన్ని మ్యాచ్ లలో ఓపెనర్ గా వచ్చి మంచి పరుగులే సాధించాడు. భయం లేకుండా ఆడటం ఇతని నైజం. శిఖర్ ధావన్ కి కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి వన్డే క్రికెట్లో. యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్ లో లేదు కాబట్టి వీళ్ళ నుంచి గట్టి పోటీనే ఎదురుకుంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -