Roja: మినిష్టర్ రోజా నటించిన వన్ అండ్ ఓన్లీ బాలీవుడ్ మూవీ గురించి మీకు తెలుసా?

Roja: తెలుగు చిత్రసీమలో హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన రోజా.. నటనలో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో చాలా సినిమాల్లో నటించిన రోజా అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించింది. ఇక కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మంచి పేరే కొట్టేసింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రోజా ఒక బాలీవుడ్ మూవీలో నటించింది. అదేంటో మీకు తెలుసా..

ఇక నటిగా తనదైన శైలి నటనతో.. తెరపై అందాల తారగా అలరించిన రోజా, అప్పట్లో కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మళయాళంలోనూ మంచి పేరు గడించారు. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గి పోయిన తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా మొదట్లో ఓడిపోయినా.. తర్వాత మంచి విజయాలు సాధించింది.

అప్పట్లో హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన “ది జెంటిల్మెన్” సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్ లో నటించింది రోజా. ఇది తమిళ్, తెలుగులో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన “జెంటిల్మెన్” సినిమాకు రీమేక్ గా తీశారు. సౌత్ లో ఈ ఐటెం సాంగ్ లో గౌతమి నటించగా.. హిందీలో రోజా ఐటెం సాంగ్‌లో మెరిపించింది.

అయితే ఈ సినిమాలో కేవలం ఐటెం సాంగ్ లో మాత్రమే నటించింది రోజా. ఇక ఇది కాకుండా హిందీలో ఎలాంటి పాత్ర పోషించలేదు. ఆ వైపు అప్పట్లో ఆలోచనలు కూడా చేయలేదు రోజా. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -