Roja: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో భాగంగా జరిగిన క్రాస్ ఓటింగ్ గురించి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఇలా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు అంటూ గుర్తించిన పార్టీ అధిష్టానం ఆ నలుగురు ఎమ్మెల్యేల పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినటువంటి నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ నేతలు మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ…క్రాస్ ఓటింగ్ కి పాల్పడినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఈమె సవాల్ విసిరారు. ఇక ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఏదో సాధించారనీ సంబరపడుతున్నారని ఈమె ఎద్దేవా చేశారు.ఇక ఉండవల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాదులో డాక్టర్ గా ఉన్నటువంటి ఈమెను ఎన్నికల బరిలో నిలబెట్టి ఎమ్మెల్యేగా జగన్ గెలిపించారని గుర్తు చేశారు.
కరోనా సమయంలో ఉండవల్లి శ్రీదేవికి ప్రత్యేకంగా ఫ్లైట్ ఏర్పాటు చేసి తన ప్రాణాలు కాపాడిన జగన్ గారి నుంచి ఇప్పుడు ప్రాణహాని ఉంది అంటూ కామెంట్లు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని రోజా మండిపడ్డారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా,ఎంత సీనియర్ లీడర్ అయినా తమను చూసి ఓట్లు వేశారు అనుకుంటే పొరపాటేనని కేవలం జగన్ గారి ఫోటో వల్లే గెలిచామంటూ ఈ సందర్భంగా రోజా తెలిపారు.
ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాజీనామా చేసి వచ్చి ఎన్నికలలో మీకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేసి గెలవండి అప్పుడే ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుంది అంటూ ఈమె తెలిపారు. అలాకాకుండా పార్టీ గురించి జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడటం ఏమాత్రం సరి కాదని రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.