Ronaldo: రొనాల్డో కలచెదిరే!.. వరల్డ్ కప్ ముద్దాడకుండానే ముగియనున్న కెరీర్

Ronaldo: ప్రపంచ క్రీడల్లో అత్యంత జనాకర్షకమైనదిగా ఫుట్ బాల్ ను చెప్పొచ్చు. ధనార్జనలోనూ ఈ గేమ్ ను మించింది లేదు. లీగ్స్ వచ్చాక ఫుట్ బాల్ బంగారు బాతులా తయారైంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రావడంతో ఆటగాళ్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అయితే ఎంత లీగ్స్ లో ఆడినా జాతీయ జట్టుకు ఆడటం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. అందునా ప్రపంచ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీని గెలవడమనేది ఫుట్ బాల్ ఆటగాళ్లకు జీవితకాల కోరికనే చెప్పాలి. ప్రముఖ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో కల కూడా అదే.

 

సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కల మరోసారి చెదిరింది. కెరీర్ చివరి ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ పోర్చుగల్ స్టార్‌కు నిరాశే ఎదురైంది. అనామక జట్టు మొరాకో.. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్‌కు షాకచ్చింది. దీంతో రొనాల్డో కంట నీళ్లు ఆగలేదు. తమ జట్టు ఓటమిని తట్టుకోలేని రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 1-0తో బలమైన పోర్చుగల్‌కు చెక్ పెట్టి మొరాకో సెమీస్‌కు దూసుకెళ్లడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఆఫ్రికన్ టీమ్‌గా రికార్డులకెక్కింది.

పోర్చుగల్‌కు మళ్లీ నిరాశే..!

మొరాకో విజయానికి స్టార్ ప్లేయర్ యూసెఫ్ ఎస్ నెస్రీనే కారణం. ఆట మొదలైన 42వ నిమిషంలో అద్భుతమైన హెడర్‌తో గోల్ చేసి మొరాకోకు హిస్టారికల్ విక్టరీని అందించాడు. గ్రూప్ స్టేజ్‌లో బెల్జియం, ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెక్ పెట్టిన ఆఫ్రికన్ జట్టు.. ఇప్పుడు ఏకంగా పోర్చుగల్‌ను చిత్తు చేసింది. దీంతో 1966, 2006 తర్వాత సెమీస్ చేరాలని ఆశించిన పోర్చుగల్‌కు మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది.

 

కెరీర్‌లో ఒక్కసారైనా వరల్డ్ కప్ అందుకోవాలని ఆశించిన రొనాల్డో ఆశ నెరవేరలేదు. ప్రిక్వార్టర్స్‌లో రొనాల్డోను చాలా సేపు బెంచ్‌పై ఉంచి రమోస్‌ను ఆడించి హిట్ కొట్టిన పోర్చుగల్ ఈసారి 50 నిమిషాల దాకా రొనాల్డోను బెంచ్‌పై కూర్చోబెట్టి దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. దీంతో తట్టుకోవడం ఆయన ఫ్యాన్స్ వల్ల కాలేదు.

డిఫెన్స్ ఛేదించడంలో రమోస్ ఫెయిల్

మొరాకో విజయంలో స్ట్రైకర్ నెస్రీతోపాటు గోల్ కీపర్‌ యాసిన్‌ బోనో పాత్ర కూడా ఎంతో ఉంది. అతడు గోల్‌కు అడ్డుగోడలా నిలిచాడు. పోర్చుగల్‌ ప్లేయర్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకున్నా.. ఫినిషింగ్‌ లోపంతో బోర్లాపడింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచిన రమోస్‌.. మొరాకో డిఫెన్స్‌ను ఛేదించడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. దీంతో ఫస్టాఫ్‌లో బెంచ్‌కే పరిమితమైన రొనాల్డోను సెకండాఫ్‌లో బరిలోకి దించినా గోల్‌ మాత్రం నమోదు కాలేదు. పోర్చుగల్‌ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. మొరాకో మాత్రం పోరాడితే పోయేదేం లేదన్నట్టుగా ఆడి బంపర్ విక్టరీ కొట్టింది. ఈ ఓటమితో వరల్డ్‌కప్‌ ముద్దాడకుండానే రొనాల్డో కెరీర్‌ ముగిసిపోనుంది.

Related Articles

ట్రేండింగ్

Balakrishna: బాలయ్య కెరీర్ లో చిక్కుకున్న వివాదాలివే.. నీ బ్లడ్, బ్రీడ్ అప్పుడైమైందంటూ?

Balakrishna: బాలయ్య విచిత్రమైన మెంటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా తనకి ఇష్టం వచ్చినట్లు చేసి సభా...
- Advertisement -
- Advertisement -