RuthurajRecord: రుతురాజ్ ఒక ఓవర్‎లో ఏడు సిక్సులు కొట్టినప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే?

RuthurajRecord: టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో బౌలర్ నోబాల్ వేయడంతో ఆశ్చర్యకర రీతిలో ఏడు సిక్సర్లు సాధ్యమయ్యాయి. అంతేకాకుండా బుధవారం అసోంతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ మహారాష్ట్ర ఆటగాడు రెచ్చిపోయాడు. 126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 168 పరుగులు చేసి మరో భారీ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇటీవల ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టిన సమయంలో ఐదో సిక్స్ కొట్టిన తర్వాత తనకు టీమిండియా మాజీ బ్యాటర్ గుర్తుకువచ్చాడని రుతురాజ్ అన్నాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ కొట్టిన ఆరు సిక్సర్లు తనకు గుర్తుకొచ్చాయని.. తాను కూడా ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ సరసన చేరాలని బలంగా కోరుకున్నట్లు పేర్కొన్నాడు. తన చిన్నతనంలో ఉన్నప్పుడు యువీ రికార్డును చూశానని.. అయితే ఏకంగా అతడి రికార్డును తాను దాటేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

అయితే ఓ ఆటగాడు ఒక ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టడం క్రికెట్ చరిత్రలో తొలిసారి. దీంతో రుతురాజ్ ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు చాలా మంది ఆటగాళ్లు సాధించారు. గిబ్స్ (దక్షిణాఫ్రికా), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), యువరాజ్ (భారత్), సర్‌గార్ ఫీల్డ్ సోబర్స్ (ఇంగ్లండ్), రాస్ విట్లే (ఇంగ్లండ్), హజ్రాతుల్లా జజాయ్ (ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్ (న్యూజిలాండ్) వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

ఐపీఎల్ వేలంలో రుతురాజ్‌కు డిమాండ్
ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. వచ్చే ఏడాది కోసం చెన్నై అతడిని వేలంలో వదిలేసింది. దీంతో డిసెంబరులో జరిగే మినీ వేలంలో రుతురాజ్‌కు రికార్డుస్థాయిలో మంచి ధర పలికే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలం అయిన రుతురాజ్ టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో పునరాగమనం చేయాలనే పట్టుదలతో రుతురాజ్ ఉన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -