S S Rajamouli: రాజమౌళి స్టేట్ ర్యాంకరా.. ఆయన గురించి ఈ నిజాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

S S Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్ కు డైరెక్టర్ గా వ్యవహరించారు అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో ఈయన దర్శకుడుగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జక్కన్న బాల్యం గురించి కొన్ని విషయాలు ఓ ఇంటర్వ్యూ ద్వారా తన తల్లి సన్నిహితురాలు వెల్లడించారు. జక్కన్న ముద్దు పేరు బంటి అనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.చిన్నప్పుడు ఎంతో అల్లరి పనులు చేసేటటువంటి ఈయన ప్రస్తుతం ప్రపంచం గర్వించే స్థాయిలో ఉన్నారు.

ఇకపోతే రాజమౌళి చదువులో చాలా వీక్ అని అందుకే తాను పై చదువులు చదువుకోలేదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆయన కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారని పలు ఇంటర్వ్యూల సందర్భంగా రాజమౌళి వెల్లడించారు.అయితే ఈ విషయంపై రమా గారు స్పందిస్తూ తాను ఇంటర్ చదువుకున్నాను అని చెబుతారు కానీ ఆయన సర్టిఫికెట్ నేను ఒకసారి కూడా చూడలేదనీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రాజమౌళి చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కొవ్వూరులోని దీప్తి స్కూల్లో జరిగింది. ఇక ఈయన ఏలూరులో తన మేనత్త ఇంటి దగ్గర ఉంటూ చదువుకున్నారు. 7వ తరగతి చదువుకున్నారు. అయితే ఏడవ తరగతి పరీక్షలలో జక్కన్న స్టేట్ ర్యాంక్ సంపాదించుకోవడంతో ఈయన పేరు అప్పట్లోనే పేపర్లో ప్రచురితమైంది. ఇది చూసిన కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. ఇలా 10 వరకు అక్కడే చదివిన రాజమౌళి ఇంటర్ కూడా ఏలూరులోని సి. ఆర్ రెడ్డి కాలేజీలోనే పూర్తి చేశారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఏడవ తరగతిలో జక్కన్న స్టేట్ ర్యాంక్ సాధించడం నిజంగానే విశేషం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -