Sachin Son: సచిన్ కొడుకుకు ఇలాంటి పరిస్థితా.. అయ్యో పాపమంటూ?

Sachin Son: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బాటలోనే కొడుకు అర్జున్ టెండుల్కర్ క్రికెట్ ను ఎంచుకున్నాడు. తండ్రి బ్యాటర్ అయితే కుమారుడు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సారి ఐపీఎల్ లో మ్యాచ్ లోకి ఎంటర్ అయ్యాడు. ముంబయి ఇండియన్స్ టీం తరపున ఆడుతున్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ కెరీర్ ఆరంభంలోనే పొగడ్తలతో పాటు విమర్శలనూ ఎదుర్కుంటున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ తెలివిగా బౌలింగ్ చేసి భువనేశ్వర్ వికెట్ తీసి అందరి ప్రశంసలు పొందాడు అర్జున్.తీసింది ఒక్క వికెట్ అయినా మీడియా అతడికి భారీ ప్రాచుర్యం కల్పించడంతో అర్జున్ పేరు మార్మోగిపోయింది.

అయితే గేమ్స్ లో విమర్శలు, పొగడ్తలు కామన్. అప్పుడే పొగుడుతారు, అంతలోనే తిట్టేస్తారు. అర్జున్ టెండుల్కర్ కొడుకు విషయంలోనూ అచ్చం ఇదే జరిగింది. హైదరాబాద్ తో మ్యాచ్ లో నోరు తీపి చేసుకున్న అర్జున్, నిన్న పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ లో మాత్రం చేదును అనుభవించాల్సి వచ్చింది. పంజాబ్ తో పోరులో అర్జున్, చెత్త ప్రదర్శనతో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

 

పంజాబ్ తో మ్యాచ్ లో తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. 16వ ఓవర్లో మాత్రం భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులిచ్చాడు. హర్‌ప్రీత్ బ్రర్, సామ్ కరన్ లు అర్జున్ బౌలింగ్ లో చెలరేగి ఆడారు.

ఈ సీజన్ లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్లలో గుజరాత్ పేసర్ యశ్ దయాల్ తో కలిసి సంయుక్తంగా నిలిచాడు.దయాల్ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో రింకూ సింగ్ ఐదు సిక్సర్ల విధ్వంసానికి 31 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక ఆ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ అతడు ఆడలేదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -