Sai Pallavi: సాయిపల్లవి అంటే క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్?

Sai Pallavi: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమెకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా న్యాచురల్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా తెలుగులో ఈమె ఇప్పటివరకు ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, ప్రేమమ్, పడి పడి లేచే మనసు, మారి, విరాటపర్వం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. ఇకపోతే సాయి పల్లవి చివరి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.

దీంతో అప్పటినుంచి సాయి పల్లకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో సినిమాలు లేవు. ఇక సాయి పల్లకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి అభిమానులు ఈమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సాయి పల్లవి రూటే సపరేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద హీరో అయినా కూడా తనకి కథ నచ్చితేనే ఆమె సినిమా ఓకే చేస్తూ ఉంటుంది.. అది కూడా హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇప్పటివరకు ఇంకా సాయి పల్లవి స్పందించలేదు.

 

ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పల్లవి గురించి ఒక బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతను మరెవరో కాదు నటుడు గుల్షన్ దేవయ్య. తాజాగా సాయి పల్లవి గురించి గుల్షన్ దేవయ్య చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి ప‌ల్ల‌వి అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆమె త‌న క్ర‌ష్ అంటూ ఒక ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు గుల్ష‌న్‌. ఆమె ఫోన్ నంబ‌ర్ త‌న వ‌ద్ద ఉన్న‌ప్ప‌టికి ఈ విష‌యాన్ని ఆమెతో చెప్పే ధైర్యం మాత్రం చేయ‌లేక‌పోయాను అని తెలిపారు. అంతేకాకుండా సాయి పల్లవితో నటించే అవకాశం వస్తే అది తన అదృష్టంగా భావిస్తాను అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేశాడు గుల్షన్ దేవయ్య. సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన న‌టి, డ్యాన్స‌ర్. ఆమె న‌టించిన సినిమాలు అన్నింటిని చూస్తాను. చాలా కాలం నుంచి ఆమె అంటే ఇష్టం. కాని ఆ విషయం చెప్పలేను అని తెలిపారు. ఆమె అంటే నాకు క్ర‌ష్ మాత్ర‌మే. అంత‌కు మించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు గుల్షన్ దేవయ్య.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -