SaiPallavi-PawanKalyan: ఆ సినిమాలో సాయిపల్లవి వద్దని పవన్ కళ్యాణ్ సూచించారా?

SaiPallavi-PawanKalyan: యూత్‌లో సాయిప‌ల్ల‌వి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యంగ్ హీరోల‌తో స‌మాన‌మైన పాత్ర‌లు పోషిస్తూ ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను హిట్ చిత్రాలు ఉన్నాయంటే ఈ అమ్మ‌డుఎంత ల‌క్కీగాల్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తెలుగుతోపాటు త‌మిళ్, మ‌ల‌యాళంలో కూడా సినిమాలు చేస్తూ త‌న కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటుంది.

అయితే ఈమె అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని వార్త ఒక‌టి ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చ‌లామ‌ణి అవుతున్న ఈమెను ఒక ప్ర‌ముఖ క‌ధానాయ‌కుడు త‌న సినిమాలో రిజెక్ట్ చేసాడ‌నే వార్త ఇప్పుడు ఫిల్మ్ స‌ర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాయిప‌ల్ల‌వి పెట్టిన కండీష‌న్స్ న‌చ్చ‌క ఈమెను రిజెక్ట్ చేసార‌ని వార్త‌లు వినిపిస్తున్నా అస‌లు విష‌యం వేరే ఉంద‌ని తెలుస్తుంది. ఈమె ఆ పాత్ర‌కు స‌రిపోద‌నే కార‌ణంగానే ఈమెను ఆమెను ప‌క్క‌న‌పెట్టార‌ని ఆ సినిమాకు ప‌నిచేసేవారు అంటున్నారు.

 

ఇంత‌కీ ఏం జ‌రిగింది?
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రూపొంద‌బోయే భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ చిత్రంలో షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఓవైపు త‌ను క‌మిట్ అయిన సినిమాలును పూర్తిచేస్తూనే రాజ‌కీయాల‌లో కూడా ఆయ‌న బిజీగా ఉండ‌డంతో ఈ సినిమా ఎప్ప‌టిక‌ప్పుడు ఆల‌స్యం అవుతూ వ‌స్తుంది. ఎప్పుడో మొద‌లుపెట్టిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కూడా ఇంకా పూర్తికాలేదు. అందుకే ప‌వ‌ర్‌స్టార్ లేకుండా మిగ‌తా తారాగ‌ణం ఉండే సీన్ల‌ను ముందుగా షూట్ చేయాల‌ని హ‌రీశ్‌శంక‌ర్ ఫిక్స్ అయ్యార‌ట‌.

ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. ఇప్పిటికే ఒక హీరోయిన్‌గా పూజాహెగ్దేను ఫిక్స్ చేవారు. సికెండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు సాయిప‌ల్ల‌విని అనుకుంటున్నార‌ట‌. అయితే హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి వ‌ద్దంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేశార‌ని ఈ సినిమా సిబ్బంది నుండి వార్త‌లు వ‌స్తున్నాయి. సాయిప‌ల్ల‌వి రిజెక్ట్ అయ్యింద‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారంది. ఇప్ప‌టికే చేతులో పెద్ద‌గా సినిమాలు లేని ఈ అమ్మ‌డుకు మ‌రింత క‌ష్టం వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -