Samantha: చైతన్య మరో పెళ్లి చేసుకోవాలని సామ్ సలహా ఇచ్చిందా?

Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న అక్కినేని కుటుంబానికి అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జోష్’ సినిమాతో తెలుగులో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఇప్పుడు మంచి కంటెంట్ ఉండే సినిమాలు చేసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

తన ‘ఏమాయ చేసావె’ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సమంతతో ఏళ్లకు ఏళ్లు ప్రేమాయణం నడిపిన నాగచైతన్య.. మొత్తానికి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ మధ్యనే వీరిద్దరు విడిపోగా.. వీరిద్దరు విడిపోవడానికి రకరకాల కారణాలు అంటూ పలు వార్తలు వచ్చాయి. తాజాగా విడిపోవడానికి ముందు నాగచైతన్య విషయంలో సమంత అలా చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.

 

నాగచైతన్య మరియు సమంతలు పరస్పర అంగీకారంతో విడిపోగా.. వీరు ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. అయితే విడిపోవడానికి ముందు నాగచైతన్యను మరో పెళ్లి చేసుకోవాలని సమంత సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య విషయంలో సమంత ఎంతో ప్రేమతో ఉండేదని, అందుకే తాను విడిపోయినా నాగచైతన్య మాత్రం సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే మరో పెళ్లి గురించి సలహా ఇచ్చిందట.

 

అదే సమయంలో నాగచైతన్య కూడా సమంత అంటే ఎంతో ప్రేమ కారణంగానే.. అతడు మరో పెళ్లికి అంగీకరించలేదట. తాను మరో పెళ్లి చేసుకోబోవడం లేదని తేల్చి చెప్పేశాడట. మొత్తానికి వీరిద్దరు ఏ కారణంతో విడిపోయారనే విషయం క్లారిటీ రాకపోయినా, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఇప్పటికే ఉందనే విషయం ఈ వార్త విన్న వాళ్లంతా అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -