Samantha: అక్కడి ప్రేక్షకులను మోసం చేస్తున్న సమంత.. విడాకుల తర్వాత ఇంత మార్పా?

Samantha: సమంత.. తెలుగు ప్రేక్షకులకు నీ పేరు పరిచయం అక్కరలేనిది. ఏ మాయ చేసావే సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు కి ఉన్న క్రేజ్ కి బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు అందుకుంది.

అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టి ఫ్యామిలీ మెన్ వంటి పలు వెబ్ సిరీస్ లు చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లో పంచుకొని తన అభిమానులను ఒక రేంజ్ లో మెప్పిస్తుంది. ఇక ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమాతో సమంత వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో సమంత తన హావభావాలను పలికించి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక పాన్ ఇండియా స్థాయిలో సమంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా యశోద. కాగా ఈ సినిమాకు హరి-హరిస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత టైటిల్ క్యారెక్టర్ లో నటిస్తుంది. కాగా ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏవేవో కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఈ సినిమా విషయంలో కొన్ని నిందలు ఎదుర్కొంటుంది.

తెలుగు సినిమా అయిన యశోద సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు సమంత హిందీ సినిమా అని ప్రమోట్ చేస్తుందట. సమంత విడాకుల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడానికి ఇలా చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నార. మరి కొందరు సమంత క్రేజ్ కోసం ఏలాంటి పనికైనా ఒడిగడుతుందని వార్తలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -