Samantha: నాగార్జున ఇంటికి వెళ్లబోతున్న సమంత.. అదే కారణమా?

Samantha: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత పేరు వినిపిస్తోంది. యశోద సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సమంత వ్యక్తిగతంగా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాటి నుంచి ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం సమంత తన వ్యాధిని తగ్గించుకునేందుకు వర్కవుట్లు చేస్తోంది. త్వరలోనే ఆమె మళ్లీ మాములు మనిషి కానుంది.

కాగా సమంత క్యూర్ అయిన తర్వాత తన మాజీ మామ అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లనున్నట్లు ఫిలింనగర్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అయితే నాగ్ ఇంటికి సమంత ఎందుకు వెళ్తుందన్న విషయంపై స్పష్టంగా తెలియనప్పటికీ ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు. ముఖ్యంగా సమంత తన డైవర్స్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ నాగచైతన్యతో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుందని.. అందుకే ఆమె నాగ్ ఇంటికి వెళ్లబోతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సమంతకు మయోసైటిస్ వచ్చిన నాటి నుంచి నాగ్ కుటుంబం తనకు కొండంత అండగా ఉంటోందని సమంత సన్నిహితులతో చెప్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఏదేమైనా సమంత, నాగచైతన్య మళ్లీ కలిస్తే చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. నాగచైతన్య కూడా సమంత విషయంలో పాజిటివ్‌గా ఉన్నాడని.. ఆమె వస్తానంటే తానొద్దంటానా అన్న రీతిలో ఆలోచిస్తున్నాడనే ప్రచారం వినిపిస్తోంది. గతంలో ఏ మాయ చేశావె సినిమాతో తొలిసారి సినిమాల్లో కలిసి నటించిన నాగచైతన్య, సమంత హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఈ మూవీ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాల్లో కలిసి నటించారు. మరోసారి నటిస్తే చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సమంతకు అండగా నిలిచిన అక్కినేని ఫ్యామిలీ

సమంత అనారోగ్యంపై ఇప్పటికే పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రియమైన సమంత… నీకు మరింత బలం రావాలి. నీపై అందరూ ప్రేమ చూపించాలి అంటూ అఖిల్ అక్కినేని పోస్ట్ చేశాడు. అటు సమంత ఈ వ్యాధిని ఎదుర్కొని బలంగా, ధైర్యంగా బయటకు రావాలని.. ఆమెకు భగవంతుడు మరింత ఎనర్జీ, స్ట్రెంగ్త్ రావాలని కోరుకుంటున్నట్లు హీరో సుశాంత్ పోస్ట్ చేశాడు. అటు నాగచైతన్య, నాగార్జున కూడా నేరుగా కాకుండా పరోక్షంగా సమంత కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -